వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డికి తాత్కాలిక బెయిల్ మంజూరు అంశంపై హైకోర్టు కొన్ని సూచనలు చేసింది. చట్టపరమైన మార్గాలున్నాయా? లేదా ? పరిశీలించాల్సిందిగా కోర్టు సూచన చేసింది. ఈ అంశంపై జగన్, సీబీఐ తరపు లాయర్ల అభిప్రాయాలను కోర్టు అడిగింది. దీనిపై రేపు మధ్యాహ్నం విచారణ జరుగుతుంది. 10 రోజులపాటు జగన్ కు మధ్యంతర బెయిల్ ఎందుకివ్వకూడదు? మనది ప్రజాస్వామ్య దేశంకదా అని హైకోర్టు పేర్కొంది. ముందు జగన్ ని ప్రచారంలో పాల్గొనీయండి అని హైకోర్టు వ్యాఖ్యానించింది. రాజ్యాంగం ప్రకారం భావాలను వెల్లడించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. ఎన్నికల తర్వాత కస్టడీపై చట్టప్రకారం వ్యవహరించవచ్చు కదా అని హైకోర్టు వ్యాఖ్యానించింది.
Tuesday, 29 May 2012
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment