తిరుపతి: తిరుచానూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాదయాత్ర వైఎస్ఆర్ కుటుంబానికి పేటెంట్ హక్కు అన్నారు. వైఎస్ఆర్ పాదయాత్రను టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు కాపీకొట్టారన్నారు. ప్రజల కడగండ్లు తుడవడానికే షర్మిలమ్మ పాదయాత్ర చేయనున్నట్లు తెలిపారు. పాదయాత్ర సజావుగా జరగడానికి దేవదేవుణ్ని కోరుకోవడానికి తిరుమల వచ్చినట్లు తెలిపారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment