రిమాండ్‌లో 90 రోజులు ఉన్న తర్వాత కూడా వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి బెయిల్ ఇవ్వకపోవడాన్ని ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ బార్ అసోసియేషన్ అనుబంధ ‘అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం’ తప్పుబట్టింది. చట్ట ప్రకారం దక్కాల్సిన సమాన, న్యాయమైన అవకాశాలను నిరాకరించడం మానవ హక్కుల ఉల్లంఘనేనని సంఘం ఆంధ్రప్రదేశ్ చైర్మన్ ఎం.తమీమ్ చెప్పారు. ఈమేరకు సోమవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. ‘90 రోజులు రిమాండ్‌లో ఉంటే బెయిల్ ఇవ్వాల్సిందేనన్న జస్టిస్ లక్ష్మణరెడ్డి వ్యాఖ్యలను సమర్థిస్తున్నాం. జగన్‌కు సంబంధించిన అంశాన్నే మేము నేరుగా ప్రస్తావిస్తున్నాం. ఆయన బెయిల్ పొందడానికి అన్నివిధాలా అర్హుడు. బెయిల్ ఇవ్వడం ద్వారా చట్టప్రకారం ఆయనకున్న హక్కులను గౌరవించాలి. మానవ హక్కుల గురించి మనం మాట్లాడితే.. సమాజంలో జగన్‌కు ఉన్న మద్దతు, అభిమానాన్ని పరిగణనలోనికి తీసుకోవాల్సిందే. సమాజంలోని భిన్న వర్గాల సమస్యల పరిష్కారంలో ఆయన పాత్రను గుర్తించాల్సిందే. జగన్ స్ఫూర్తిదాయకమైన నేతని సమాజంలోని అత్యధికులు అభిప్రాయపడుతున్నట్లు మేము నిర్వహించిన సర్వేలో తేలింది’ అని తెలిపారు.
source:sakshi
source:sakshi
No comments:
Post a Comment