తెలంగాణలో తన ఉనికి కాపాడుకోవడం కోసమే టీఆర్‌ఎస్ పార్టీ సూర్యపేటలో సభ నిర్వహించిందని వైఎస్‌ఆర్ సీపీ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి అన్నారు. గతంలో వైఎస్‌ఆర్ చెప్పిన పథకాలనే కేసీఆర్ ప్రస్తావించారన్నారు. వైఎస్ వల్లే బీబీనగర్ నిమ్స్ వచ్చిందన్న విషయాన్ని గుర్తు చేశారు. ఆయన బతికి ఉంటే.. అది ఎప్పుడో అందుబాటులోకి వచ్చేదన్నారు. పులి చింతల ప్రాజెక్టు సమయంలో క్యాబినెట్లో టీఆర్‌ఎస్ మంత్రలున్నారని, అప్పుడు మాట్లాడని కేసీఆర్ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారో సమాధానం చెప్పాలన్నారు. విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌తో కేటీఆర్ చేసుకున్న చీకటి ఒప్పందాల మాటేంటని అడిగారు. కేసీఆర్ ఆస్తులు అప్పటికీ, ఇప్పటికీ ఎంత పెరిగాయో బహిరంగ చర్చకు సిద్ధమం కావాలని జిట్టా సవాల్ విసిరారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీల గురించి కేసీఆర్ ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో విస్తృత ఆదరణ ఉందని, షర్మిల పాదయాత్రకు తెలంగాణ ప్రజలు బ్రహ్మరథం పడుతుండటమే దీనికి నిదర్శమన్నారు. తెలంగాణను ఎవరూ అడ్డుకోవడం లేద ని జట్టా తెలిపారు. |
Monday, 26 November 2012
ఉనికి కోసమే టీఆర్‌ఎస్ సభ:జిట్టా
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment