YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Wednesday, 30 May 2012

రైతులకు,అక్కాచెల్లెళ్లకు భరోసా లేదు:విజయమ్మ

శ్రీకాకుళం: ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ పాలనలో రైతులకు, అక్కాచెల్లెళ్లకు భరోసా లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు ఆమె నరసన్నపేట రోడ్ షోలో ప్రసంగించారు. ఈ ఎన్నికలు రాజకీయాలను మార్చే ఎన్నికలన్నారు. ఇక్కడకు వస్తే తనకు వైఎస్ఆర్ పాదయాత్ర గుర్తుకొస్తోందని చెప్పారు. మీ ప్రేమాభిమానాలు చూస్తుంటే ఆ మహానేత మాటలు గుర్తుకు వస్తున్నాయన్నారు. వైఎస్ కోసం నిలబడినవారిలో ధర్మాన కృష్ణదాస్ ఒకరని చెప్పారు. జగన్ చాలా ధైర్యంగా ఉన్నాడని, ఈ మాటలను ప్రజలకు చెప్పమని తనని పంపినట్లు తెలిపారు. జగన్ చట్టాన్ని 
గౌరవించే వ్యక్తి అని చెప్పారు. సిబిఐ అత్యుత్సాహంతో జగన్ ని అరెస్ట్ చేసిందన్నారు.

వైఎస్ఆర్ పథకాలకు ఈ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని బాధపడ్డారు. పథకాల అమలుపై ప్రజల నమ్మకం పోయిందని చెప్పారు. వైఎస్ మరణంపై చాలా అనుమానాలున్నాయన్నారు. ఆ అనుమానాలను తీర్చాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని చెప్పారు. నాడు వైఎస్ విషయంలో ఏం జరిగిందో నేడు జగన్ విషయంలో అదే జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 

విజయమ్మ వెంట జగన్ సోదరి షర్మిల కూడా ఉన్నారు. వారిద్దరినీ చూసేందుకు జనం ఉప్పెనలా తరలి వచ్చారు. నరసన్నపేట జనంతో నిండిపోయింది. ప్రధాన రహదారితోపాటు వీధులన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. మేడలపైన, మిద్దెలపైన జనమే జనం.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!