పెట్టుబడుల కేసులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రిమాండ్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు ఆగస్టు 1వ తేదీ వరకు పొడిగించింది. ఇదే కేసులో నిందితులుగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్య, మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణారావు, వాన్‌పిక్ సంస్థల అధినేత నిమ్మగడ్డ ప్రసాద్, ఐఆర్‌ఏఎస్ అధికారి బ్రహ్మానందరెడ్డిల రిమాండ్‌ను కూడా కోర్టు 1వ తేదీ వరకు పొడిగించింది.
వీరందరి రిమాండ్ ముగియడంతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీబీఐ ప్రత్యేక కోర్టు ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు ఎదుట హాజరుపర్చారు. కేసు దర్యాప్తులో ఉన్నందున వీరి రిమాండ్ పొడిగించాలని కోరుతూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను పరిశీలించిన అనంతరం న్యాయమూర్తి ఈమేరకు ఉత్తర్వులు వెలువరించారు.

No comments:
Post a Comment