వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సిరిసిల్ల ధర్నాలో పాల్గొంటే టీఆర్‌ఎస్‌కు కలిగే బాధేమిటో అర్ధం కావడం లేదని ఆ పార్టీ నేత బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. వైఎస్సార్ ఆశయాలకు అనుగుణంగా చేనేత కార్మికుల కోసం విజయమ్మ పోరాడటంలో తప్పేముందని ఆయన ప్రశ్నించారు. దీన్ని బట్టి చూస్తే చేనేత కార్మికుల సంక్షేమం మీద టీఆర్‌ఎస్‌కు ఉన్న చిత్తశుద్దేమిటో అర్దమవుతోందని వ్యాఖ్యానించారు. ప్రజా పోరాటాలను రాజకీయాల కోసం బలిచేయవద్దని బాజిరెడ్డి టీఆర్‌ఎస్ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment