* ఎగువ ప్రాంతంలో వర్షాలు లేకపోవడమే కారణం
* కృష్ణా, గోదావరి బేసిన్‌లోకి రాని వరద నీరు
హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతున్నా ప్రాజెక్టుల్లోకి నీరు రావడం లేదు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు లేకపోవడంతో ఇటు కృష్ణా బేసిన్ , అటు గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టుల్లోకి వరద నీరు చేరడం లేదు. మన ప్రాజెక్టుల్లోకి వరద నీరు రావాలంటే మహారాష్ర్ట, కర్ణాటకల్లో విస్తారంగా వర్షాలు కురవాల్సి ఉంది. ప్రస్తుతం అక్కడ వర్షాలు లేవు. గత ఏడాది ఈ సమయంలో కర్ణాటకలోని ఆలమట్టి డ్యాం నుంచి 1.55 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం మన రాష్ట్రంలోకి వచ్చింది.
ఎగువన ఉన్న ఆలమట్టి, నారాయణపూర్ వంటి ప్రాజెక్టులు నిండాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఎగువ, దిగువ ప్రాజెక్టులన్నీ ఖాళీగానే ఉన్నాయి. ఇప్పటికి శ్రీశైలంలోకి ఎలాంటి వరద రావడం లేదు. సాగర్‌లోకి మాత్రం 2 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. గోదావరి దిగువ ధవళేశ్వరం ప్రాంతంలో 12 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉంది.

No comments:
Post a Comment