రాష్ట్రపతి ఎన్నికల్లో వైఎస్సార్‌సిపి అనుసరించిన వైఖరి సరైనదేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి చెప్పారు. దీనిని ప్రజాస్వామ్యవాదులు ఎవరైనా అర్ధం చేసుకుంటారనిన్నారు. జగన్ బెయిల్‌తో ప్రణబ్ ఓటుకు ముడిపెట్టడం తగదని ఆమె తెలిపారు. ఆ వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి మానసిక పరిస్థితి సరిగాలేదని తెలుస్తోందనిన్నారు. చట్టం, రాజ్యాంగం, న్యాయస్థానాల పట్ల లెక్కలేని తనాన్ని వెల్లడిస్తోందని శోభా తెలిపారు. సీబీఐ, కాంగ్రెస్ మీద మా పార్టీ వైఖరిలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు. సీబీఐతో కాంగ్రెస్సే కాదు టీడీపీ కూడా కుట్రకు పాల్పడిందని చెప్పారు. ఇదంతా ప్రజలు గమనిస్తూనే ఉన్నారని శోభానాగిరెడ్డి చెప్పారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment