రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీకే ఓటు వేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ అధ్యక్షతన సమావేశమైన ఎమ్మెల్యేలు, ఎంపి మేకపాటి రాజమోహన రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. సమావేశం ముగిసిన అనంతరం ఎంపి మేకపాటి విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయం తెలిపారు. ఈ నెల 19న జరిగే భారత రాష్ట్రపతి ఎన్నికల్లో రాజకీయాలకు అతీతంగా ఓటు వేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఓటు హక్కుని వినియోగించుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రపతి ఎన్నికలో తటస్థంగా ఉండబోమన్నారు. ఓటు వేయకుండా ఉండటం ప్రజాస్వామ్యానికి విరుద్ధం అన్నారు. సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడుతున్న ఈ తరుణంలో ప్రణబ్ అందరికీ న్యాయం చేయగలరన్న నమ్మకంతో ఆయనకు ఓటు వేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. దేశ ప్రధమ పౌరుడిగా ప్రణబ్ స్వతంత్రంగా వ్యవహరిస్తారని తాము భావిస్తున్నామన్నారు.
ఉప రాష్ట్రపతి ఎన్నికలలో ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన అన్సారీకి ఓటు వేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.
ఉప రాష్ట్రపతి ఎన్నికలలో ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన అన్సారీకి ఓటు వేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.
No comments:
Post a Comment