తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అక్రమాస్తుల కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ దాఖలు చేసిన పిటిషన్ ఈ నెల 23న సుప్రీం కోర్టులో విచారణకు రానుంది. రిట్ పిటిషన్‌ను కొట్టేస్తూ రాష్ట్ర హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను సవాల్ చేస్తూ విజయమ్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
చంద్రబాబు, ఆయన బినామీల ఆస్తులపై విచారణ కోరుతూ గత ఏడాది అక్టోబర్ 10న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విజయమ్మ సమర్పించిన సవివరమైన డాక్యూమెంట్లను పరిశీలించిన హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి గులాం అహ్మద్, నూతి రామ్మోహన్ రావుతో కూడిన డివిజన్ బెంచ్, చంద్రబాబు అండ్ కో ఆస్తులపై సీబీఐ విచారణకు ఆదేశించింది. దీన్ని చంద్రబాబు అనుచరులు సుప్రీంలో సవాల్ చేశారు. తమ వాదనలు వినకుండా, సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందని సుప్రీంలో వాదించారు. అయితే ఈ విషయాన్ని హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. దీంతో చంద్రబాబు అండ్ కో హైకోర్టులో దాఖలు చేసిన వెకేట్ పిటిషన్ రెండు బెంచ్‌లు మారింది. చివరకు జస్టిస్ రోహిణి, మహంతాతో కూడిన బెంచ్ ముందుకు వచ్చింది. వెకేట్ పిటిషన్‌పై తీర్పు ఇవ్వాల్సిన బెంచ్ ఏకంగా రిట్ పిటిషన్‌ను కొట్టేస్తూ ఆదేశాలు ఇచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ విజయమ్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో చంద్రబాబు సహ మొత్తం 13 మందిని విజయమ్మ ప్రతివాదులుగా పేర్కొన్నారు. వీరిలో చంద్రబాబు భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్, ఈనాడు సంస్థల అధిపతి రామోజీరావు, సుజనా చౌదరి, నామా నాగేశ్వరరావులు ఉన్నారు.

No comments:
Post a Comment