న్యూఢిల్లీ : సీబీఐకి స్వయం ప్రతిపత్తి కల్పించాలన్న అంశంపై ఢిల్లీ హైకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ ప్రలోభాలతో పని చేస్తోందని, రాజకీయ కుట్రలను అమలు చేస్తోందని ప్రముఖ ఆడిటర్ విజయసాయిరెడ్డి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రాన్ని బుధవారం ఆదేశించింది. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్‌తోపాటు సీబీఐలకు కూడా నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే బుధవారానికి వాయిదా వేసింది.
Wednesday, 18 July 2012
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment