వస్త్రోత్పత్తి చేసే వృత్తి నైపుణ్యం తమదైనా, లాభాలు పెట్టుబడిదారుల హక్కుభుక్తమయ్యాయి. చేనేతకన్నా మరమగ్గాలు మెరుగైన జీవితాన్ని ఇస్తాయని ఆశించిన నేతన్నలకు నిరాశే ఎదురైంది. సగటు చేనేత కార్మిక కుటుంబం రోజువారీ కూలీ ఈ నాటికీ రూ.100 నుంచి రూ.150కు మించడంలేదు. మరమగ్గాల కార్మికుల ఆదాయం కూడా ఇంతకు మించి లేకపోవడం గమనార్హం.
మరమగ్గాలపై నేసే నేతన్నల సమస్యలకు కరీంనగర్ జిల్లా సిరిసిల్ల ముఖచిత్రంగా మారిం ది. సిరిసిల్ల ఊరి పూర్వ నామం ‘శ్రీశాల’. నిజాం కాలంలో చేనేత రంగంలో అగ్రగామిగా నిలిచింది. సిరిసిల్లతో పాటు కరీంనగర్ జిల్లాలో ఇంకా అనేక చోట్ల చేనేత ఉచ్ఛదశలో ఉండేది. 1987-88 చేనేత జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 5 లక్షల చేనేత మగ్గా లుంటే ఒక్క కరీంనగర్ జిల్లాలోనే లక్షకుపైగా చేనేత మగ్గాలుండేవి.
జగిత్యాల, సిరిసిల్ల, కోరుట్ల, కమలాపూర్, మెట్‌పల్లి, వేములవాడ, పెద్దపల్లి మొదలైన ప్రాంతాలలో వేలాదిగా చేనేత వృత్తిదారులు ఉండేవారు. ఇంకా చెప్పాలంటే చేనేత మగ్గంలేని గ్రామాలు కరీంనగర్ జిల్లాలో బహుస్వల్పం. ఇంతటి ప్రాధాన్యం గల ఈ ప్రాం తంలో కరువు, గిట్టుబాటు సమస్యల కారణంగా వేలాది మంది చేనేత పనివారు పశ్చిమ భారతానికి వలస వెళ్లారు. 1960, 1970లలో షోలాపూర్, భివండి, సూరత్ వంటి పట్టణాలలో మిల్లులు, మరమగ్గాలలో పనిచేసేందుకు నేతన్నలు వలసబాట పట్టారు. ఈ వలసల అనుభవం నుంచి మరమగ్గాలను తమతమ గ్రామాలకు తీసుకు రావాలనే ఆలోచన వారిలో తలెత్తింది.
ఈ క్రమంలో సరిగ్గా 50 ఏళ్ల క్రితం 1961లో ప్రధాన చేనేత కేంద్రమైన సిరిసిల్లకు పత్తిపాక విశ్వనాథం సోదరులు రెండు జోడీల మరమగ్గాలు (సాంచాలు) తెచ్చుకున్నారు. 1961లో ఆరం భమైన మరమగ్గాల ప్రస్థానం 1980ల నాటికి వేగం పుం జుకుంది. 1982లో తలెత్తిన సంక్షోభం సిరిసిల్ల నేతన్నల జీవితాలను అతలాకుతలం చేసింది. 1990ల నాటికి వాటి సంఖ్య 25 వేలకు చేరుకుంది. అయితే ఆ ఏడాది పరిశ్రమ కుప్పకూలిన ఫలితంగా ఎందరో నేతన్నలు, అద్దకం రం గుల వ్యాపారులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 2001లో 32 వేల మరమగ్గాలుండగా, సంక్షోభానికి సాక్షీభూతంగా వాటిలో సగం తుక్కు కింద అమ్మేశారు. ఈ ఒక్క ఏడాది లోనే 156 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రస్తుతం సిరిసిల్ల పట్టణంలో మొత్తం 33 వేల మరమగ్గాలున్నాయి.
సంక్షోభం మూలాలు
చేనేత రంగ సంక్షోభం ఈ నాటిది కాదు. ఆధునిక సమాజ పురోగమనంలో యాంత్రికీకరణ మూలంగా సంప్రదాయ జ్ఞానం, ఉత్పత్తులు నిరాదరణకు గురవుతున్నాయి. సామ్రాజ్యవాద కుట్రలో భాగంగా బ్రిటిష్ పాలకులు చేనేత పరిశ్రమ నడ్డివిరిచారు. చేనేత కార్మికుల బొటన వేళ్లను నరికి దేశీయ నైపుణ్యాన్ని బుగ్గిచేయాలని చూశారు. ఈ పరిణామమే జాతీయోద్యమంలో విదేశీ వస్త్ర బహిష్క రణకు దారితీసింది.
స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో మన పాలకులు వస్త్రరంగంలో చేనేత పరిశ్రమను గుర్తించి ప్రోత్సహించారు. స్థానిక మార్కెట్ల కోసం ఉత్పత్తి చేసే నేతన్నలు, దేశ-విదేశీ వినియోగదారుల కోసం ఉత్పత్తి చేయడం ఆరంభించారు. కానీ నూలు, రంగుల ధరలకు అనుగుణంగా తాము తయారు చేసిన వస్త్రాలకు ధర పలకకపోవటంతో నష్టాలపాలై నేతన్నలు ఇతర వృత్తులు చేపట్టాల్సి వచ్చింది. అన్ని ఉత్పత్తి రంగాలలో వచ్చిన యాంత్రికీకరణ వస్త్రరంగంలోనూ ప్రవేశించింది.
ఫలితంగా యంత్రాలపై వస్త్రాలు ఉత్పత్తి చేయడం ఆరంభ మైంది. మరమగ్గాలపై పనిచేసిన నేతన్నలు తామే స్వయంగా మరమగ్గాలు ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయిం చడంతో తొలిదినాల్లో సిరిసిల్ల కేంద్రంగా మగ్గాల ఏర్పాటు ఉధృతంగా సాగింది. మరమగ్గాలు నెలకొల్పేందుకు లక్ష లాది రూపాయల పెట్టుబడి అవసరమవుతుంది. అయితే హెచ్చు మోతాదులో పెట్టుబడులు తప్పనిసరి కావడంతో సంపన్నులు, వడ్డీ వ్యాపారులు ఈ రంగంలోకి వచ్చారు. ఫలితంగా వృత్తి నైపుణ్యం తప్ప ధనబలం లేని నేతన్నలు కూలీలుగా మారిపోయారు.
దీంతో నేతన్నలు అనివా ర్యంగా పరాయీకరణకు గురయ్యారు. వస్త్రోత్పత్తి చేసే వృత్తి నైపుణ్యం తమదైనా, లాభాలు పెట్టుబడిదారుల హక్కుభుక్తమయ్యాయి. చేనేతకన్నా మరమగ్గాలు మెరు గైన జీవితాన్ని ఇస్తాయని ఆశించిన నేతన్నలకు నిరాశే ఎదురైంది. సగటు చేనేత కార్మిక కుటుంబం రోజువారీ కూలీ ఈ నాటికీ రూ.100 నుంచి రూ.150కు మించడం లేదు. మరమగ్గాల కార్మికుల ఆదాయం కూడా ఇంతకు మించి లేకపోవడం గమనార్హం.
అత్యధిక జనాభా, నిరుద్యోగం గల మన దేశానికి యూరప్ అభివృద్ధి నమూనాయే పరిష్కారమార్గం అని బల్లగుద్ది వాదించేవారు మరమగ్గాల సంక్షోభం గురించి అడిగితే ఏం సమాధానం చెబుతారు? చేనేత కార్మికులు ఇంకా పాతకాలపు మగ్గాలపై పనిచేస్తున్నారని, మరమగ్గా లను ప్రోత్సహించాలని కాక మరేం చెబుతారు! మరి మరమగ్గాలను ప్రోత్సహించడంలోనూ మన ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నది సిరిసిల్ల అనుభవం నిగ్గుదేర్చింది.
కారణాలు లెక్కకు మిక్కిలి
వేలాది మంది కుటుంబాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సిరిసిల్ల అర్ధశతాబ్దంగా ఉపాధి కల్పిస్తున్నది. ఈ రంగానికి ప్రధాన వనరు ఇంధనం. విద్యుత్తు ధరలు పెరగడంతో 2000 సంవత్సరం సిరిసిల్ల మరమగ్గాల పరిశ్రమలో క్షీణ దశకు నాంది పలికింది. పరిశ్రమ ఒక్కసారిగా కాటన్ వస్త్రా లతయారీ నుంచి పాలిస్టర్ వస్త్రాల తయారీ వైపు మొగ్గ డంతో ఇక్కడి ఉత్పత్తిదారులు హైదరాబాద్‌లోని పెట్టు బడిదారులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. నూలు, రంగుల అద్దకం, సైజింగ్, మార్కెటింగ్ వంటి విషయాలపై ఏనాడూ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించ లేదు. నేతన్నల ఆకలి చావులు, ఆత్మహత్యల నేపథ్యంలో సానుభూతి ఒలకబోసే ఓటు బ్యాంకు రాజకీయాలే తప్ప చిత్తశుద్ధితో వస్త్ర పరిశ్రమను అభివృద్ధి పర్చాలని భావించలేదు.
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పవర్‌లూం పార్కు ఏర్పాటు చేసినా అది పెట్టుబడిదారులకు, మాస్టర్ వీవర్లకే ప్రయోజనం చేకూర్చింది. ఇంతాచేసి కార్మికులు కోరుతున్నది పనికి తగిన వేతనం, ఆరోగ్య రక్షణ, వృత్తి భద్రత, పిల్లల చదువులు వంటి కనీస అవసరాలు. కానీ అవి ప్రభుత్వానికి గొంతెమ్మ కోరికల్లా కనిపిస్తున్నాయి. ఈ నాటికీ నేతన్నల జీవితాలు ఏ విధంగా చూసినా దుర్భరంగానే ఉన్నాయి. సిరిసిల్లలో ఆత్మహత్యలు చేసుకున్న నేత పనివారి భార్యలు సంఘంగా ఏర్పడటం సంక్షోభ తీవ్రతకు అద్దం పడుతున్నది. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురుచూడటమే నేతన్నల వంతైంది.
నేతకు వైఎస్ చేయూత
2004 ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ ప్రభుత్వం రైతులతోపాటు నేతన్నలకు ఆపన్న హస్తం అందించటంలో ముందుంది. ఆత్మహత్యలు చేసుకున్న నేతన్నల కుటుంబాలకు లక్షన్నర ఎక్స్‌గ్రేషియాను ప్రకటిం చింది. ముఖ్యంగా సిరిసిల్ల మరమగ్గాల పరిశ్రమ అభి వృద్ధికి 50 శాతం విద్యుత్ సబ్సిడీని ఖచ్చితంగా అమలు పరిచింది.
ప్రతి నేతన్న కుటుంబానికి ఆర్థిక వెసులుబాటు కోసం రూ.50 వేల చొప్పున సుమారు రూ.100 కోట్ల రుణ సౌకర్యం కల్పించింది. ఆకలి చావులతో పాటు, ఆత్మ హత్యలు జరిగిన ప్రతి కుటుంబానికి అదనంగా రూ.25 వేల చొప్పున నష్టపరిహారం ఇచ్చారు. వృద్ధాప్య పింఛన్లు, వితంతు పింఛన్లు, ఆరోగ్య వసతి కల్పించారు. కానీ గత రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం విద్యుత్ సబ్సిడీ రూ.4 కోట్ల మేర రీయింబర్స్ చేయలేదు. ఆత్మహత్యలు చేసుకున్న వారి కుటుంబాలకు లక్షన్నర ఎక్స్‌గ్రేషియా చెల్లింపులో అలక్ష్యం కనబరుస్తున్నది.
క్షుద్ర రాజకీయం...
వైఎస్‌ఆర్‌సీపీ ఇటీవల ప్రజాసమస్యలపై పోరాడుతున్నది. గతంలో ధర్మవరంలో చేనేత కార్మికుల సమస్యల పరిష్కా రానికి ధర్నా నిర్వహించారు. ఈ నెల 23న విజయమ్మ నేతన్నలకు అండగా దీక్ష నిర్వహించేందుకు సిరిసిల్ల వస్తున్న సందర్భంగా వివాదం సృష్టించడం అసమం జసం. ఆరు నెలల క్రితం ‘రైతు దీక్ష’ చేసిన జగన్‌ను ఆర్మూ ర్‌లో అడ్డుకోని టీఆర్‌ఎస్, నేతన్నల కోసం దీక్ష చేపట్టిన విజయమ్మను అడ్డుకోవడంలోని ఆంతర్యం ఏమిటి? ప్రజాసమస్యలపై ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోరాడ తారు. తమను పరామర్శించడానికి వచ్చే ప్రతి ఒక్కరినీ నేతన్నలు స్వాగతించారు. ఓటు రాజకీయమైనా, సీటు రాజకీయమైనా నేతన్నలకు భవిష్యత్‌పై ఆశ. విజయమ్మ రాకతో నైతిక మద్దతు తమకు లభిస్తుందని వారు అభిలషిస్తున్నారు.
నేతన్నల సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి, తెలంగాణ అంశాన్ని తెరపైకి తేవడం టీఆర్‌ఎస్ ఓటు రాజకీయంలో భాగమేనని నేత కార్మికులు భావిస్తున్నారు. తెలంగాణ రాజకీయ రంగంలో అత్యధిక జనాభా కలిగిన పద్మశాలీలు ప్రభావవంతమైన పాత్ర పోషిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలోనూ వారిది కీలకపాత్ర. అయినా టీఆర్‌ఎస్ పార్టీ ఏనాడూ చేనేత కులస్తులను నాయకులుగా ఎదగనీయలేదు. అసెంబ్లీ, లోక్‌సభ ప్రవేశం కోరే పద్మశా లీలకు ఏనాడూ బీ-ఫారం ఇవ్వలేదు.
కానీ కరీంనగర్, మహబూబ్‌నగర్, మెదక్ పార్లమెంట్ స్థానాలలో పద్మ శాలీలను ఓడించిన ఘనత ఆ పార్టీకే దక్కుతుంది. సిరిసిల్లను కబ్జా చేసింది టీఆర్‌ఎస్ పార్టీనే. పద్మశాలీల ఓటు బ్యాంకు పూర్తిగా దూరం అవుతుందనే భయంతోనే విజయమ్మ ధర్నాను ఆ పార్టీ అడ్డుకోజూస్తుంది తప్ప, తెలంగాణ రాష్ట్ర సాధనపై చిత్తశుద్ధితో కాదు. ప్రాంతీయ ఉద్యమం పేరుతో నేతన్నలకు వ్యతిరేకంగా రాజకీయం చేస్తున్న టీఆర్‌ఎస్‌కు తగిన గుణపాఠం చెప్పడానికి సిరిసిల్ల సిద్ధంగా ఉంది.
- తడ్క యాదగిరి
కన్వీనర్ తెలంగాణ పద్మశాలి ఉద్యమ వేదిక

No comments:
Post a Comment