చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఈ నెల 23న సిరిసిల్లలో చేయ తలపెట్టిన ధర్నా సజావుగా నిర్వహించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంత నాయకులు గట్టి నిర్ణయం తీసుకున్నారు.
పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఒక సమావేశంలో వ్యవసాయరంగం తరువాత అంతటి ప్రధానమైన చేనేత రంగం ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో కూరుకు పోయి ఉందనీ అందువల్ల తమ నాయకురాలు వారి దీన పరిస్థితిని ఎలుగెత్తి చాటి రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలనే ఉద్దేశ్యంతో చేస్తున్న ధర్నాకు ఎవరూ అడ్డంకులు సృష్టించాలనుకోవడం సరికాదని నాయకులు అభిప్రాయపడ్డారు. రెచ్చగొట్టే ప్రకటనలకు ప్రాధాన్యమివ్వకుండా ధర్నాపైనే దృష్టిని ప్రధానంగా కేంద్రీకరించాలని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు.

No comments:
Post a Comment