రాష్ట్రపతి ఎన్నికల్లో టీడీపీ, టీఆర్‌ఎస్ వైఖరి గర్హనీయమని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీనేత గట్టు రామచంద్రరావు అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కును వినియోగించుకోకపోవడం దేశద్రోహమన్న చంద్రబాబు రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో తీసుకున్న నిర్ణయంపై ఏమి చెబుతారని గట్టు ప్రశ్నించారు. రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని టీడీపీ, టీఆర్‌ఎస్ ఒకే రకమైన నిర్ణయం తీసుకోవడం వెనుక ఏ రకమైన ఫిక్సింగ్ జరిగిందో చెప్పాలని గట్టు డిమాండ్ చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment