వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అద్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, ఆయన ఆడిటర్ విజయసాయిరెడ్డిలకు నార్కొ పరీక్ష నిర్వహించాలన్న సిబిఐ పిటిషన్ ను నాంపల్లి సిబిఐ కోర్టు కొట్టివేసింది. నిజానికి సిబిఐ ఇలాంటి పిటిషన్ వేయకుండా ఉండవలసింది. ఎందుకంటే సిబిఐ తనవద్ద అనేక ఆధారాలు ఉన్నాయని చెబుతూనే మళ్లీ నార్కో టెస్టును కోరడంలో ఆంతర్యం అర్ధం కాదు. విజయసాయిరెడ్డి విషయంలో గతంలో నే కోర్టు ఇలాంటి తీర్పు ఇచ్చినా, మళ్లీ సిబిఐ ఈ పిటిషన్ వేయడం కాస్త ఆశ్చర్యంగానే ఉంది. ఏది ఏమైనా సిబిఐ ఇప్పటికైనా దీనిని రాజకీయ కోణంలో కాకుండా,వృత్తిపరమైన నిపుణతతో , ఈ కేసులో సంబందం ఉందన్న అనుమానాలు ఉన్నవారందరిపై విచారణ జరిపే తీరులో సిబిఐ వ్యవహరిస్తే మంచిది. అలాకాకుండా కేవలం జగన్ ను మాత్రమే టార్గెట్ చేసుకుని దర్యాప్తు జరుగుతోందన్న అభిప్రాయం ప్రబలేలా సిబిఐ విచారణ కొనసాగిస్తే దానివల్ల వ్యవస్థకు నష్టం కలుగుతుంది.
source: kommineni
source: kommineni





No comments:
Post a Comment