తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు, బినామీల అక్రమాస్తులకు సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ దాఖలు చేసిన వ్యాజ్యం ఈ నెల 23న సుప్రీంకోర్టు ముందు విచారణకు రానున్నది. బాబు అండ్ కో అక్రమాస్తులపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలని ఫిర్యాదు చేస్తూ తాను దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ విజయమ్మ ఈ పిటిషన్ దాఖలు చేశారు.
చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులతో పాటు బినామీలైన రామోజీరావు, సీఎం రమేష్, సుజనా చౌదరి, నామా నాగేశ్వరరావు, మురళీమోహన్, కర్నాటి వెంకటేశ్వరరావు తదితరుల అక్రమాస్తులపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలంటూ విజయమ్మ గత ఏడాది హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఈ వ్యాజ్యాన్ని విచారించిన అప్పటి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గులాం మహ్మద్, జస్టిస్ నూతి రామ్మోహనరావులతో కూడిన ధర్మాసనం.. విజయమ్మ చేసిన ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయంటూ.. చంద్రబాబు, ఆయన బినామీల అక్రమాస్తులపై ప్రాథమిక విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సీబీఐని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయమూ విదితమే. ఈ మధ్యంతర ఉత్తర్వులపై చంద్రబాబు బినామీలుగా పేర్కొంటున్న రామోజీరావు, సి.ఎం.రమేష్, నామా నాగేశ్వరరావు తదితరులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోబోమని, హైకోర్టుకే వెళ్లి తేల్చుకోవాలని వారికి తేల్చి చెప్పింది.
దీంతో చంద్రబాబు, రామోజీ, సి.ఎం.రమేష్ తదితరులు సీబీఐ విచారణ నిమిత్తం జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ హైకోర్టులో వేర్వేరుగా అనుబంధ పిటిషన్లు దాఖలు చేశారు. అభ్యంతరాలు, నాట్ బిఫోర్ నాటకాల అనంతరం ఈ కేసును విచారించిన జస్టిస్ రోహిణి నేతృత్వంలోని ధర్మాసనం.. సీబీఐ విచారణకు ఆదేశిస్తూ జస్టిస్ గులాం మహ్మద్ నేతృత్వంలోని ధర్మాసనం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ముందుగా నిలుపుదల చేసింది. తరువాత చంద్రబాబు అక్రమాస్తులపై విజయమ్మ తదితరులు దాఖలు చేసిన ప్రధాన పిటిషన్‌ను, అనుబంధ పిటిషన్లను కొట్టివేస్తూ జస్టిస్ రోహిణి నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ విజయమ్మ ఇటీవల సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్‌ఎల్‌పీ) దాఖలు చేశారు.

No comments:
Post a Comment