వాన్‌పిక్ ప్రాజెక్టుతో ప్రభుత్వానికి పైసా నష్టం కూడా లేదని వాన్‌పిక్ సంస్థల అధినేత నిమ్మగడ్డ ప్రసాద్ తరఫు న్యాయవాది ఉమామహేశ్వర్‌రావు సీబీఐ ప్రత్యేక కోర్టుకు నివేదించారు. ప్రాజెక్టు కేటాయింపు, అభివృద్ధి విషయంలో ప్రభుత్వానికి తమకు మధ్య ఎలాంటి వివాదం లేదన్నారు. బెయిల్ మంజూరు చేయాలంటూ నిమ్మగడ్డ ప్రసాద్ దాఖలు చేసుకున్న పిటిషన్‌ను ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు గురువారం మరోసారి విచారించారు. రస్‌ఆల్‌ఖైమా (రాక్) ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ప్రాజెక్టుల అభివృద్ధి ఒప్పందం జరిగిందని, నిమ్మగడ్డ రాక్‌కు మాత్రమే ఏజెంట్ అని ఉమామహేశ్వర్‌రావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంతో నిమ్మగడ్డ నేరుగా ఒప్పందం చేసుకోలేదని, ప్రభుత్వం నుంచి నేరుగా భూమి కానీ, ఇతర రాయితీలు పొందలేదని చెప్పారు. అందువల్ల నిమ్మగడ్డకు ఐపీపీ 409 వర్తించదని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో నిమ్మగడ్డ నిర్దోషిగా విడుదలైతే... ఆయనకు జరిగిన నష్టాన్ని సీబీఐ ఎలా తీరుస్తుందని ప్రశ్నించారు. నిమ్మగడ్డను అరెస్టు చేసి 60 రోజులు దాటిందని, ఛార్జిషీట్ దాఖలు చేయనందున ఆయనకు బెయిల్ ఇవ్వాలని కోరారు. ఈలోగా కోర్టు సమయం ముగియడంతో విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. అయితే శుక్రవారం 40 నిమిషాల్లోగా వాదనలు ముగించాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment