
జగన్ నిర్ణయంపై ఎన్డీఏ కన్వీనర్ శరద్‌యాదవ్,మాయావతి, ములాయంసింగ్ యాదవ్, మమతా బెనర్జీ తదితర నేతలతోపాటు జాతీయ మీడియా, జగన్‌ను వ్యతిరేకించే మీడియా సైతం అభినందిస్తుంటే, జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక టీడీపీ వాళ్లు అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారన్నారు. జగన్ ఏ పనిచేసినా దాన్ని వ్యతిరేకించడమే లక్ష్యంగా చంద్రబాబు వ్యవహరించడం వల్ల మొన్నటి ఎన్నికల్లో రెండూ మూడు స్థానాలకు పడిపోయారని, ఇదే పరిస్థితి కొనసాగితే డిపాజిట్లు కోల్పోయే స్థానానికి చేరుకుంటారన్నారు. రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌ను ఆదరించే స్థితిలో లేరని చెప్పారు. జగన్ సీఎం కావాలన్న ప్రజల నిర్ణయాన్ని ఎవరూ మార్చలేరన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రాతినిధ్యం వహించేవారు కచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు.
No comments:
Post a Comment