జగన్‌ను చూసేందుకు వచ్చిన అభిమానులపై లాఠీ ఝులిపించారు పోలీసులు. రోడ్లన్నీ బ్లాక్ చేసి ఎక్కడి వారిని అక్కడే కట్టడి చేశారు. అభిమానంతో ముందుకొచ్చిన వారిని అరెస్ట్ చేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసేందుకు వైఎస్ జగన్ అసెంబ్లీకి వెళ్తారన్న విషయం తెలుసుకున్న అభిమానులు ఆయనను చూసేందుకు చంచల్‌గూడ జైలు వద్దకు పెద్దసంఖ్యలో చేరుకున్నారు. ఆయన ఎప్పుడు బయటకు వస్తారా అని ఉత్కంఠతో వేచి చూశారు.
అభిమానుల రాకతో జైలు పరిసర ప్రాంతాలన్ని సందడిగా మారిపోయాయి. ఇక పోలీసులు షరా మామూలుగా ప్రవర్తించారు. యువనేత కోసం వచ్చిన వందాలాది మంది అభిమానులపై కఠినంగా వ్యవహరించారు. 200 మీటర్ల వరకు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ముందుకు రాకుండా ముళ్ల కంచెలు అడ్డుపెట్టారు. అయినా వీటిని దాటుకుని లోపలికి దూసుకువచ్చిన కొందరు అభిమానులను జగన్‌ను చూడకుండా కట్టడి చేశారు. నల్గొండ క్రాస్ రోడ్ నుంచి చంచల్‌గూడ వైపు వస్తున్న 150 మంది కార్యకర్తలను అరెస్టు చేశారు. జైలు పరిసర ప్రాంతాల్లో పార్టీ జెండాలు, ప్లకార్డులు పట్టుకుని తిరిగిన ప్రతివారినీ అడ్డుకున్నారు.

No comments:
Post a Comment