రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డికి సిబిఐ ప్రత్యేక కోర్టు అనుమతించింది. మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణకు కూడా ఓటు వేసేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది.
రాష్ట్రపతి ఎన్నికల్లో జగన్ ఓటేసేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సీబీఐ స్పష్టం చేసింది. ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు తనకు అనుమతినివ్వాలంటూ జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ ప్రత్యేక కోర్టులో వాదనలు జరిగాయి. ఈ నెల 19న రాష్ట్ర శాసనసభలో నిర్వహించే పోలింగ్‌లో ఓటు వేసేందుకు అనుమతి ఇవ్వాలని జగన్ కోరారు. గతంలో ఇదే అంశాన్ని వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికీ నివేదించారు. దీనిపై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. తమకు అభ్యంతరం లేదని చెప్పింది. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం జగన్ ఓటు వేసేందుకు అనుమతి ఇస్తూ తీర్పు చెప్పింది. అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కూడా జైళ్ల శాఖను ఆదేశించింది.

No comments:
Post a Comment