మంత్రి టీజీ వెంకటేష్ వ్యాఖ్యలు సరికాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గురునాథ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డిలు అన్నారు. పనిచేయని వాళ్లను కాల్చివేయాలన్న మంత్రి వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకుంటే, మంత్రి మండలిలో సగం మంది మంత్రులను కాల్చివేయవలసి ఉంటుందన్నారు. అందుకు ఆయన సిద్ధమేనా అని వారు ప్రశ్నించారు. టీజీ వ్యాఖ్యలు ప్రజల్లో తప్పుడు సంకేతాలిస్తున్నాయన్నారు. మంత్రి టీజీ తన వ్యాఖ్యలు ఉపసంహరించుకుని ఐఎఎస్ అధికారులకు క్షమాపణ చెప్పాలన్నారు. మంత్రి టీజీ తన మానసిక స్థితిపై వైద్యుడిని సంప్రదించాలని సలహా ఇచ్చారు.
Monday, 16 July 2012
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment