న్యూఢిల్లీ : యూపీఏలో నెంబర్.2 పంచాయతీ కొనసాగుతోంది. కేంద్రమంత్రి వర్గంలో కాంగ్రెస్, ఎన్సీపీల మధ్య రెండో స్థానం కోసం ఏర్పడ్డ సంక్షోభం తారాస్థాయికి చేరింది. కేంద్రమంత్రి పదవులకు వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్, భారీ పరిశ్రమల మంత్రి ప్రఫుల్ పటేల్ రాజీనామా చేశారు. వారు తమ రాజీనామా లేఖలను శుక్రవారం ఉదయం ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు పంపారు. కాగా వీరిరువురు నిన్న సాయంత్రమే రాజీనామా చేసినట్లు సమాచారం. శరద్ పవార్ ఈరోజు సాయంత్రం ప్రధానమంత్రితో భేటీ కానున్నారు. అయితే రాజీనామాలపై అటు కాంగ్రెస్ కానీ, ఇటు ఎన్‌సిపి కానీ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment