నిజామాబాద్ స్థానిక సంస్థల స్థానంలో ఫలితం తారుమారు
హైదరాబాద్, న్యూస్‌లైన్:

ఓట్ల లెక్కింపుల్లో అవకతవకలు జరిగాయని, రీకౌంటింగ్ నిర్వహించాలని కోరుతూ వెంకటరామిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీన్ని పరిశీలించిన హైకోర్టు... ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివాదాస్పదంగా మారిన మూడు ఓట్లు వెంకటరామిరెడ్డికి అనుకూలంగా ఉన్నాయని గతంలో తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ నర్సారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించగా...వివాదాస్పంగా మారిన మూడు ఓట్లను ముందుగా లెక్కించిన తర్వాత మిగిలిన మొత్తం ఓట్లను లెక్కించాలని సుప్రీంకోర్టు హైకోర్టును ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో పోలైన ఓట్లను తిరిగి లెక్కించిన తర్వాత... వెంకటరామిరెడ్డి 9 ఓట్లతో గెలుపొందినట్లు హైకోర్టు తీర్పునిచ్చింది.
ఓట్లను ఇలా లెక్కించారు: పిటిషనర్, ప్రతివాదితోపాటు ఇరువర్గాల న్యాయవాదులు, ఎన్నికల రిటర్నింగ్ అధికారి సమక్షంలో వివాదాస్పదంగా మారిన 26 ఓట్లను గుర్తించారు. 16 ఓట్లు చెల్లనివిగా తేల్చారు. మిగిలిన 10 ఓట్లలో వెంకటరామిరెడ్డికి 7 ఓట్లు వచ్చినట్లు గుర్తించారు. దీంతో గతంలో వచ్చిన 335+7 ఓట్లతో కలిసి మొత్తం 342 ఓట్లు వెంకటరామిరెడ్డికి వచ్చాయి. ఈ నేపథ్యంలో 9 ఓట్ల తేడాతో వెంకటరామిరెడ్డి గెలుపొందినట్లు హైకోర్టు నిర్ధారించింది.
సుప్రీంకోర్టును ఆశ్రయిస్తా: అర్కల
హైకోర్టు తీర్పు అనంతరం ఎమ్మెల్సీ అర్కల నర్సారెడ్డి శుక్రవారం ఎన్‌టీఆర్‌భవన్‌లో మీడియాతో మాట్లాడారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని ఈ సందర్భంగా ప్రకటించారు.
No comments:
Post a Comment