రాష్ట్రపతిగా ప్రణబ్‌ముఖర్జీ తగిన వ్యక్తి అని, అందుకే ఆయనకు మద్దతు ఇవ్వాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిందని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి చెప్పారు. గురువారం ఉదయం ఆయన లోటస్ పాండ్ వద్ద విలేకర్లతో మాట్లాడుతూ కాంగ్రెస్‌తో మిలాఖత్ కావల్సిన అవసరం తమకు లేదన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దయనీయంగా ఉందని అన్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే శక్తి లేకే మిగతా పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయని మేకపాటి వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్ నాయకత్వాన్ని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని ఆయన అన్నారు.

No comments:
Post a Comment