YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal
Tuesday, April 08, 2025

Thursday, 19 July 2012

‘బీసీ’ బాబు కొత్త బాగోతం!



బాబు తన వార్షిక బడ్జెట్‌లో బీసీల కోసం రూ.1,777 కోట్లు ఖర్చు చేస్తే, వైఎస్ తన వార్షిక బడ్జెట్‌లో రూ.4,319 కోట్లు ఖర్చు చేశాడు. అంటే దాదాపు రెండున్నర రెట్లు ఎక్కువ. బీసీ విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, ఫీజుల కింద శాచ్యురేషన్ పద్ధతిలో వైఎస్ వంద శాతం మందికి లబ్ధి చేకూర్చడం గమనార్హం. వైఎస్ పాలనలో మొత్తం 40 లక్షల మందికి పక్కా గృహాలు నిర్మిస్తే, అందులో 20 లక్షల మంది బీసీలు ఉన్నారు. పావలా వడ్డీ పథకం ద్వారా 70 లక్షల మంది బీసీ మహిళలు లబ్ధి పొందారు.



ఇక టీడీపీకి భవిష్యత్తులేదని లోకం కోడైకూస్తోంది. విశ్లేషకుల మాట కూడా అదే, అయితే చం ద్రబాబు మాత్రం డవున్ బట్ నాట్ అవుట్ అంటున్నాడు. తన శ్రేణులకు కొత్త ఊపిర్లు పోసే ఉద్దేశంతోనూ బహు సంఖ్యాకుై లెన బీసీలను బుట్టలో వేసుకునే ఉద్దేశంతోనూ, 2014లో బీసీ లకు వంద సీట్ల నినాదం ఇచ్చాడు. తన తొమ్మిదేళ్ల ట్రాక్ రికార్డు చవిచూసిన వారిని ఈ నినాదం మోసగించ జాలదు.

దొందూ దొందే...!

ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలు జగన్ చేతిలో చావు దెబ్బతిన్నాయి. అధికారపార్టీ రెండు సీట్లు గెలిచినా, అవి టీడీపీతో కుమ్మక్కై గెలిచినవేనన్నది అందరికీ తెలిసిందే. మళ్లీ అవి గెలుస్తామన్న నమ్మకం కూడా లేదు. సానుభూతి పవనాలతో జగన్ నెగ్గాడని పైకి ప్రకటించుకున్నా, అంతకంటే బలమైన కారణాలు దాగున్నాయన్నది ఆ రెండు పార్టీలను వేధిస్తోంది. జగన్ పార్టీ ఓడి కాంగ్రెస్ గెలిచి ఉంటే టీడీపీ నేతలు ఎగిరి గంతేసేవాళ్లే. వ్రతం చెడ్డా ఫలితం దక్కలేదన్న అవమానం ఆ పార్టీని కుంగదీస్తోంది. దీంతో బీసీల ఆదరణ సంపాదించడానికి కొత్త పన్నాగం పన్నుతోంది.

వైఎస్ తీరు అనన్యం!

బీసీల తక్షణావసరం ఆర్థిక సాధికారతేనని వైఎస్ సందేహాలకు అతీతంగా రుజువు చేశారు. ఇందుకు భిన్నంగా కొందరికి పదవుల ఆశ చూపి బీసీల ఓట్లన్నీ బుట్టలో వేసుకుని తాను ముఖ్యమంత్రి కావాలన్నదే బాబు లక్ష్యం. వందసీట్ల ఆశ చూపించి, గెలిచే బీసీలకే టిక్కెట్లన్న మెలిక పెట్టడంతోనే బాబు మోసకారితనం బయటపడింది. ఎన్టీఆర్ బలహీన వర్గాలకు అమలు జరిపిన పథకాలన్నిటినీ బాబు నీరుగార్చాడు. మద్యపాన నిషేధాన్ని రద్దుచేసి ఊరూరా బెల్టుషాపులకు గేట్లు తెరిచాడు. బియ్యం పథ కాన్ని రెండు రూపాయల నుంచి ఐదున్నరకు పెంచాడు. పెన్షన్‌ను 75 రూపాయలకు కుదించాడు. అది కూడా నాలుగైదు మాసాలకు ఒకసారి మాత్రమే ఇచ్చాడు. ఇప్పు డు అన్నీ ఉచితమేనంటూ ఆల్‌ఫ్రీ చంద్రబాబుగా కొత్త అవతారం ఎత్తాడు. ప్రజలు ఈ గిమ్మిక్కులను నమ్మరు.

వైఎస్ తన అనితరసాధ్యమైన సంక్షేమ పథకాలతో బీసీ జన సామాన్యానికి ఆర్థిక సాధికారత కల్పించాడు. చంద్రబాబు తన తొమ్మిదేళ్ల పాలనలో బీసీల కోసం పెట్టిన ఖర్చు కంటే, వైఎస్ తన ఐదేళ్ల పాలనలో పెట్టిన ఖర్చు రెండు మూడు రెట్లు ఎక్కువ. బాబు తన వార్షిక బడ్జెట్‌లో బీసీల కోసం రూ.1,777 కోట్లు ఖర్చు చేస్తే, వైఎస్ తన వార్షిక బడ్జెట్‌లో రూ.4,319 కోట్లు ఖర్చు చేశాడు. అంటే దాదాపు రెండున్నర రెట్లు ఎక్కువ. బీసీ విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, ఫీజుల కింద శాచ్యురేషన్ పద్ధతిలో వైఎస్ వంద శాతం మందికి లబ్ధి చేకూర్చడం గమనార్హం. ఉచిత విద్యుత్ మొదలు ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంటు వరకు సింహభాగం బీసీలకే ఖర్చు చేశారు. చంద్రబాబు హయాంలో కేవలం 18 లక్షల మందికి పెన్షన్లు లభిస్తే, వైఎస్ దాన్ని అర్హులందరికీ వర్తింపజేసి 75 లక్షల మందికి మంజూరు చేశాడు.

పెన్షన్ మొత్తాన్ని రూ.200లకు పెంచి, వికలాంగులకు రూ.500 చేశాడు. వృద్ధులకే గాకుండా వితంతువులకు, నేత, గీత కార్మికులందరికీ పెన్షన్ వర్తింపచేశాడు. ప్రభుత్వోద్యోగుల్లాగా ప్రతినెలా ఒకటవ తేదీకి నేరుగా పెన్షనర్ల బ్యాంకు ఖాతాల్లో పడే ఏర్పాటు చేశాడు. బియ్యం పథకంలోనూ బీసీలే అత్యధికంగా లబ్ధి పొందారు. వైఎస్ పాలనలో మొత్తం 40 లక్షల మందికి పక్కా గృహాలు నిర్మిస్తే, అందులో 20 లక్షల మంది బీసీలు ఉన్నారు. పావలా వడ్డీ పథకం ద్వారా 70 లక్షల మంది బీసీ మహిళలు లబ్ధి పొందారు. అలాగే ఫీజు రీయింబర్స్‌మెంట్ కూడా. ఈ విధంగా వైఎస్ హయాంలో ఆర్థిక సాధికారత లభించినందువల్లే ఉప ఎన్నికల్లో బీసీలంతా వైఎస్సార్ పార్టీకి ఓట్లేసి గెలిపించారు. వంద సీట్ల పాచికతో వారిని జగన్ నుంచి విడదీయడం బాబుకు అసాధ్యం.

ముదురుపాకానపడ్డ టీడీపీ సంక్షోభం!

చంద్రబాబు పదేపదే వల్లించే లక్షకోట్ల అవినీతి ఊతపదంలోని ప్రహసనాన్ని మైసూరారెడ్డి బట్టబయలు చేశారు. వైఎస్‌పై ఆ ఆరోపణలన్నీ వట్టివనీ, బాబును తృప్తిపరచడానికి తాను ఆడిన నాటకమని మైసూరా బయటపెట్టాడు. మైసూరా జగన్ పార్టీలో ప్రవేశించడంతో కడప జిల్లాలో టీడీపీ ఖాళీ అయింది. కమలాపురం సీటు కూడా దీంతో జగన్ ఖాతాలోకి వచ్చినట్లుగా భావించవచ్చు. తాజాగా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని చేసిన సంచలన వ్యాఖ్యలు, చంద్రబాబు అసలు రూపాన్ని కళ్లకు కట్టాయి. ‘నాని మీద తిరగబడండి’ అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప, నానీ ఆరోపణలకు బాబు నుంచి దీటైన సమాధానం లేదు. 2009 తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ టోకుగా ఓడిపోయిందనీ, దానికి బాధ్యతవహిస్తూ టీడీపీ అధ్యక్ష పదవికి బాబు రాజీనామా చేయాలని నాని మరో బాంబు పేల్చాడు.

తాను జగన్ నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదనీ, చంద్రబాబు రాజ్యసభ టిక్కెట్లు 300 కోట్లకు అమ్ముకున్నాడనీ తీవ్రంగా ఆరోపించాడు. చంద్రబాబు ముసుగేసుకుని కాంగ్రెస్ నాయకులను ఢిల్లీలో కలుసుకోవచ్చు కానీ, తాను విజయమ్మను, జగన్‌ను కలుసుకోరాదట! అంటూ ఎత్తిపొడిచినా బాబు కిమ్మనలేదు. పేదలు జగన్‌ను దేవుడుగా అభిమానిస్తున్నట్లు కూడా నానీ పేర్కొనడం విశేషం. అంతటితో ఆగక, తన ప్రవర్తనకు సంజాయిషీ కూడా అడగకుండా సస్పెండ్ చేయడం ఎక్కడి ప్రజాస్వామ్యమని బాబును నిలదీశాడు. రాష్ట్రాధికారాన్ని జగన్‌కు అప్పగించి చేతులెత్తడం తప్ప టీడీపీ, కాంగ్రెస్‌లకు మరో మార్గంలేదని సాక్షాత్తూ ఎల్లో పత్రికలు ఘోషించాయంటే, ఆ పార్టీలు ఎంత సంక్షోభంలో ఉన్నాయో అర్థమవుతోంది.

పుట్టి ముంచిన ‘కుమ్మక్కు’!

వైఎస్ మరణానంతరం కాంగ్రెస్, టీడీపీలు కలిసి రాష్ట్ర రాజకీయాలను భ్రష్టుపట్టించాయి. వైఎస్ మరణవార్త విని 650 మంది వైఎస్ అభిమానులు గుండె ఆగి మరణిస్తే, ఈ వార్త విన్న సోనియా-బాబులకు గుండె ఆగినంత పనయింది. జగన్‌కు లభిస్తున్న ప్రజాదరణ చూసి వారు బెంబేలెత్తుతున్నారు! జగన్ ఓదార్పుయాత్రకు లభిస్తున్న అపూర్వ ప్రజాదరణ చూసి మరింతగా రెచ్చిపోతున్నారు.

అధికారాన్ని నిలబెట్టుకోడానికి కాంగ్రెస్, పోయిన అధికారాన్ని సాధించుకోడానికి చంద్రబాబు జగన్‌ను టార్గెట్ చేసి రాజకీయాలు నడిపిస్తున్నారు. వారికి అడ్డంకిగా ఉన్న జగన్‌ను ముందు తొలగించుకోవాలి. అందుకోసం కాంగ్రెస్, టీడీపీలు కుట్రపూరితమైన అవగాహనతో మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాయి. స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో దానిని ప్రయోగాత్మకంగా అమలు జరిపి, ఉప ఎన్నికల్లో పూర్తిస్థాయిలో అమలుచేశారు. అయితే ఈ కుట్రలను, కుతంత్రాలను అర్థం చేసుకున్న ప్రజలు ఉప ఎన్నికల్లో తగు రీతిలో బుద్ధి చెప్పారు.
అధికార వ్యామోహంతో ఈ రెండు పార్టీలు 2014 లక్ష్యంగా కొత్త పన్నాగాలకు శ్రీకారం చుట్టాయి. కిరణ్ ఇందిరమ్మ బాటపడితే, చంద్రబాబు బీసీ డిక్లరేషన్ ప్రకటించాడు. కాంగ్రెస్ మంత్రివర్గ కమిటీ ఆలోచనలు ఎంతసేపూ పదవులు పంచి పెట్టడం ద్వారా బలాన్ని పెంచుకునే వైపే పరిభ్రమిస్తున్నాయి. ధరలు తగ్గించడం, రైతులను ఆదుకోవటం వారికి చేతకాదు. వైఎస్ పేరు వినపడకూడదు... అంతా కాంగ్రెస్, సోనియా చలువేనని జనానికి నచ్చచెప్పాలి. వైఎస్ ముద్రను వారి గుండెల్లో నుంచి తుడిచివేయాలి. వైఎస్ రెక్కల కష్టంతో మంత్రులైన వారు ఇంత నీచానికి పాల్పడటం ప్రజల్లో అసహ్యాన్ని రేపుతోంది. పాలు తాగి తల్లి రొమ్ము గుద్దే ద్రోహులను ప్రజలు ఎన్నటికీ క్షమించరు. అధికార భిక్ష పెట్టిన వైఎస్‌ను అవినీతిపరుడుగా, క్రిమినల్‌గా ఎఫ్‌ఐఆర్‌లో చేరిస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు! అందుకే ఉప ఎన్నికల్లో మట్టి కరిపించారు. చంద్రబాబు ఏకైక కార్యక్రమం వైఎస్, జగన్‌ల మీద బురదచల్లడమే! అది ఫలించకపోవడంతో, బీసీలను బుట్టలో వేసుకునే కొత్త పన్నాగం ఆలోచించాడు. చంద్రబాబు చరిత్ర అంతా కుట్రపూరితమేనని, స్వయాన ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాసిన ‘ఒక చరిత్ర-కొన్ని నిజాలు’ చదివితే అర్థమవుతుంది.

ప్రజలే చరిత్ర నిర్మాతలు!

ఉప ఎన్నికల్లో ఎన్ని వందల కోట్లు రూపాయలు వెదజల్లారో కిరణ్, బొత్సలు సెలవిస్తే నవతరానికి కొత్త వెలుగు ఇచ్చిన వారవుతారు! జగన్‌ను జైలుపాలు చేసి విజయాన్ని చెరపట్టాలని ఆశించిన ఈ రెండు పార్టీలను ప్రజలు చెవులు పిండి కూర్చోబెట్టారు. జగన్‌లేని లోటును విజయమ్మ జయప్రదంగా భుజాలకెత్తుకుని, ఆ బాటలోనే అవిశ్రాంతంగా ప్రయాణిస్తోంది. 2014 వరకు కూడా జగన్‌ను జైలులో బంధించి తమ పబ్బంగడుపుకోవాలన్నదే రెండు పార్టీల దుష్టతలంపుగా ఉంది. అయితే అది జరగని పని! చరిత్ర గమనాన్ని వారు శాసించలేరు. చరిత్ర చెత్తబుట్టలో ఉభయులూ చేరిపోక తప్పదు! జగన్‌ను ముఖ్యమంత్రిని చేసి, రాజన్న రాజ్యం మళ్లీ చూడాలన్నది సామాన్య ప్రజల దృఢ సంకల్పం!! 

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!