నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని దాదాపు 100 గ్రామాల్లో ఫ్లోరైడ్ రహిత మంచినీరు అందించనున్నట్లు ఆ నియోజకవర్గ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ప్రకటించారు. రూ.2 కే 20 లీటర్ల మంచినీటిని ప్రజలకు అందించాలని నిర్ణయించినట్లు చెప్పారు. అందుకు రూ.10 కోట్ల ఖర్చుతో ప్లాంట్లను నెలకొల్పేందుకు టాటా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. ఆయన తన కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్లాంట్లకు సంబంధించిన బ్రోచర్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...‘రాష్ట్రంలోని చాలాప్రాంతాల్లో నీటిలో మోతాదుకు మించి ఫ్లోరైడ్ ఉంటోంది. దీంతో 20 సంవత్సరాల వయస్సు కలిగిన వారు 60 ఏళ్ల వారిలా మారుతున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ అన్ని గ్రామాల్లో రక్షిత మంచినీరు అందిస్తామని 2009 ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. ఆ మహానేత హామీని నెరవేర్చేందుకు ఉడత సాయంగా నా వంతుగా నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో మంచినీరు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం’ అని చెప్పారు. ప్లాంట్లను 2014 నాటికి పూర్తి చేయనున్నట్లు తెలిపారు.

No comments:
Post a Comment