రాష్ట్రపతి ఎన్నికల్లో జగన్ ఓటేసేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కోర్టుకు సీబీఐ తెలిపింది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు అనుమతించాలని కడప ఎంపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నిన్న సీబీఐ ప్రత్యేక కోర్టును కోరారు. హైదరాబాద్‌లోని అసెంబ్లీ ప్రాంగణంలో జరిగే ఓటింగ్‌కు తనను అనుమతించాలని అభ్యర్థించారు. ఈ మేరకు జగన్ తరపు న్యాయవాది జి.అశోక్‌రెడ్డి సోమవారం ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 19న జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీగా ఓటు వేసేందుకు జగన్‌ను అనుమతించాలని కోరారు. దీనిపై కోర్టు ఈ సాయంత్రం నిర్ణయం వెలువరించనుంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment