విద్యుత్ సంక్షోభాన్ని పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వ ఘోర వైఫల్యానికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంగళవారం అన్ని అసెంబ్లీ నియోజకవర్గ ప్రధాన కేంద్రాల్లో ధర్నా లు చేపట్టనుంది. ఈ ‘విద్యుత్ ధర్నా’లో పాల్గొని.. ప్రభుత్వ వైఖరిపై నిరసన వ్యక్తం చేయడానికి సామాన్య ప్రజలు ఎక్కడికక్కడ సన్నద్ధమవుతున్నారు. విజయవాడలోని విద్యుత్ శాఖ ఎస్‌ఈ కార్యాలయం వద్ద జరిగే ధర్నాలో వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ స్వయంగా పాల్గొంటున్నారు. పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు, మద్దతిస్తున్న ఎమ్మెల్సీలు వారి వారి నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలో పాల్గొని, నిరసన వ్యక్తం చేస్తారు. పార్టీ అనుబంధ సంఘాల నేతలు, ముఖ్య నేతలూ పాల్గొంటారు. ధర్నా సందర్భంగా విద్యుత్ సంక్షోభ పరిష్కారంలో ప్రభుత్వ నిష్క్రియాపరత్వాన్ని ఎత్తి చూపడంతో పాటు ఉన్నతాధికారులకు పార్టీ తరఫున వినతిపత్రాలను
సమర్పిస్తారు.
అన్ని రంగాలకూ అవస్థలే: రాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా కరెంటు కటకట నెలకొంది. వ్యవసాయానికి కనీస స్థాయిలో కూడా విద్యుత్ ఇవ్వకపోవడంతో ఆ రంగం పూర్తిగా దెబ్బతింది. అటు పరిశ్రమలకు భారీగా విద్యుత్ కోతలు విధించడంతో పారిశ్రామిక వేత్తలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో రోజూ 12 నుంచి 14 గంటల పాటు కోతలు విధిస్తుండటంతో ప్రజలు అల్లాడుతున్నారు. కరెంట్ కటకటతో ఇతర అనుబంధ రంగాలు దెబ్బతినడంతో ఆ ప్రభావం ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై కూడా పడింది. బొగ్గు, గ్యాస్ కొరత వల్ల విద్యుత్ సంక్షోభం ఏర్పడుతుందన్న విషయం ముందుగానే తెలిసినా.. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టకుండా తన నిష్క్రియాపరత్వాన్ని చాటుకుంది. పైగా.. దేవుడిపై భారం వేసి వర్షాలు కోసం ఎదురుచూడ్డం తప్ప ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డే స్వయంగా ప్రకటించడంతో రాష్ట్ర సర్కారు కళ్లు తెరిపించడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ విద్యుత్ ధర్నాకు పూనుకుంది.
నేడు విజయవాడకు విజయమ్మ
వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ మంగళవారం ఉదయం 7 గంటలకు హైదరాబాద్ నుంచి విమానంలో విజయవాడ బయలుదేరి వెళ్తారు. అక్కడ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ విద్యుత్ ధర్నాలో పాల్గొంటారని పార్టీ కార్యక్రమాల సమన్వయకర్త తల శిల రఘురామ్ తెలిపారు. ధర్నా ముగిసిన అనంతరం సాయంత్రం 5.25 గంటలకు తిరిగి విమానంలో హైదరాబాద్ చేరుకుంటారని ఆయన వివరించారు. సోమవారం పులివెందుల రైతు ధర్నాలో పాల్గొన్న విజయమ్మ అదే రోజు రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్నారు.

No comments:
Post a Comment