రైతుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితో విసిగిపోయిన రైతులు వ్యవసాయం మానుకుంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అన్నదాత సమస్యల పరిష్కారం కోసం పులివెందులలో నిర్వహించిన మహాధర్నాలో విజయమ్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిత్రావతి నీటీకోసం ఎన్నిపోరాటాలు చేసినా సర్కారు స్పందిచట్లేదని ఆరోపించారు.
కర్షకుల కష్టాలు తొలగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయట్లేదని అన్నారు. మనసుంటే మార్గముంటుందని, ఈ ప్రభుత్వానికి రైతులను ఆదుకునే మనసే లేదని అన్నారు. క్రాప్‌హాలిడే ఈఏడాది మరిన్ని జిల్లాలకు విస్తరించే ప్రమాదం కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. పరిశ్రమలకు పవర్ హాలిడే వల్ల 20లక్షల మంది కార్మికులు వీధిన పడ్డారని తెలిపారు.
భూపాలపల్లిలో సీఎం తాగునీటి ప్రాజెక్టును ప్రారంభిస్తూ కనీసం దివంగత నేత పేరు కూడా గుర్తుచేయలేదని అన్నారు. వైఎస్‌ఆర్ నిర్మించిన ప్రాజెక్టును తనదన్నట్లుగా కిరణ్ ప్రచారం చేసుకుంటున్నారని తెలిపారు. త్వరలోనే జగన్ బయటకు వస్తారని, రైతుకు మరింత అండగా నిలుస్తారని విజయమ్మ భరోసా ఇచ్చారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలన్నారు. తన హయాంలో వ్యవసాయాన్ని పట్టించుకోని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇప్పుడు రైతు జపం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షంపై ప్రజలకు నమ్మకం లేదన్నారు.

No comments:
Post a Comment