ప్రజల గుండెల్లో నిలవటమే జగన్ మోహన్ రెడ్డి చేసిన తప్పా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ ప్రశ్నించారు. సీబీఐ కోర్టును తప్పదోవ పట్టిస్తోందని, వైఎస్ఆర్ కుటుంబం చేసిన తప్పేంటో అర్థం కావటం లేదని ఆమె అన్నారు. వైఎస్ఆర్ కానీ, జగన్ ఏ తప్పు చేయలేదని, తనకు న్యాయస్థానాలు, చట్టాలపై గౌరవం ఉన్నాయన్నారు. త్వరలోనే జగన్ నిర్దోషిగా బయటకు వస్తారని విజయమ్మ తెలిపారు.
హైదరాబాద్‌లో పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో విజయమ్మ ప్రారంభోపన్యాసం చేశారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అధ్యక్షతన మొదలైన సమావేశానికి పార్టీ సిజీసి, సిఈసీ సభ్యులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వివిధ విభాగాల కన్వీనర్లు హాజరయ్యారు. ఢిల్లీ పర్యటనకు సంబంధించిన విషయాలను విజయమ్మ సమావేశంలో వివరించారు. వైఎస్‌ఆర్ జయంతి సందర్భంగా ప్రత్యేక పోస్టరును ఈ సందర్భంగా విడుదల చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చునని, వాటిని ఎదుర్కొటానికి సిద్ధంగా ఉండాలని విజయమ్మ ఈ సందర్బంగా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్,టీడీపీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నా ఉప ఎన్నికల్లో ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై మద్దతు ఇచ్చారన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేసిన జగన్ ప్రస్తుతం జైల్లో ఉన్నారని, పార్టీ బాధ్యతలు చేపట్టాల్సి వస్తుందని తాను ఎన్నడూ అనుకోలేదన్నారు. చివరికి న్యాయమే గెలుస్తుందని, జగన్ వచ్చేలోపు పార్టీని పటిష్టం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని విజయమ్మ అన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment