వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 63వ జయంతి ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ ఆయనకు నివాళులర్పిస్తాయి. పేద, బడుగువర్గాల సంక్షేమం కోసం మహానేత చేసిన కృషిని స్మరించుకుంటాయి. దీంతోపాటుగా ఆయన పథకాల అమలులో నిర్లక్ష్యం వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై నిరసన తెలుపుతాయి. వైఎస్ విగ్రహాలకు ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ పాలకులకు జ్ఞానోదయం కలిగించాలని కోరుతూ వినతిపత్రాలను సమర్పిస్తారు. రాష్ట్ర రాజధానితోపాటు జిల్లా, మండల కేంద్రాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు.
వైఎస్ జయంతి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు పార్టీ అగ్రనేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే వారి ప్రాంతాలకు వెళ్లారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ ఆదివారం ఇడుపులపాయలో వైఎస్ సమాధి వద్ద నివాళులర్పించనున్నారు. ఇందుకోసం కుటుంబ సభ్యులందరితో కలిసి శనివారం రాత్రి రైలులో బయల్దేరివెళ్లారు. పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని సీబీఐ అక్రమంగా అరెస్టు చేసినందువల్ల తండ్రి జయంతి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఈ ఏడాది ఆయనకు లేకుండాపోయింది. అయితే ఆయన సతీమణి వై.ఎస్.భారతి, ఆయన సోదరి షర్మిలతోపాటుగా కుటుంబ సభ్యులందరూ ఇడుపులపాయలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా అక్కడ ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయి. రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల పార్టీ కార్యకర్తలు సర్వ మత ప్రార్థనలు, రక్తదాన శిబిరాలు, పండ్లు, పుస్తకాల పంపిణీ, వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఆదివారం ఉదయం 9.30 గంటలకు హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ యువజన విభాగం అధ్యక్షుడు పుత్తా ప్రతాపరెడ్డి తెలిపారు. అన్ని జిల్లాల్లోనూ యువజన విభాగాల తరఫున ఇలాంటి శిబిరాలు, పేద విద్యార్థులకు పుస్తకాలు, రోగులకు పండ్లు పంపిణీ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

No comments:
Post a Comment