ముఖ్యమంత్రి రోడ్డున పడబోతున్నారు. తప్పుగా అనుకోకండి... ఇకపై కిరణ్ కుమార్ రెడ్డి మెగా యాత్రలు చేయబోతున్నారు. గ్రామగ్రామానికీ తిరిగి ప్రభుత్వం చేసినమంచి పనులను గురించి చెప్పబోతున్నారు. ప్రజల్లోకి వెళ్తే తప్ప జగన్ ను ఎదుర్కోవడం కష్టమని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే వారానికి మూడు రోజులు జిల్లాల్లో యాత్ర చేయబోతున్నారు. పార్టీ విధానాలు, ప్రభుత్వం విజయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లకపోవడమే కాంగ్రెస్ ఓటమికి కారణమని ఆజాద్ ఈ మధ్యే చెప్పారు. అంతేకాక ప్రజల్లోకి వెళ్లాలని కూడా ఆయన చెప్పారు. ఆ సలహా ప్రకారమే కిరణ్ కూడా యాత్ర చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ యాత్రలో భాగంగా స్కూళ్లు, హాస్టళ్లు, కాలేజీలు, ఇరిగేషన్ ప్రాజెక్టులు, ప్రభుత్వ పనులను కిరణ్ సందర్శించబోతున్నారు.
జగన్ ను చూసి వాతలు పెట్టుకుంటే ఫలితం ఉంటుందా? జగన్ సభలకు వచ్చినట్టు జనప్రవాహం వస్తుందా? జగన్ లాగా కిరణ్ కరిస్మా చూపించగలరా? లేదా రచ్చబండ కార్యక్రమంలా రచ్చ రచ్చ అయిపోతుందా? ఇలాంటి ప్రశ్నలన్నీ కాంగ్రెస్ నాయకులను పట్టిపీడిస్తున్నాయి. అయితే నకలు కొట్టడం కూడా అంత తేలికేమీ కాదు... నకల్ కే లియే భీ అకల్ చాహియే అంటున్నారు రాజీకీయాలు తెలిసిన వాళ్లు.

No comments:
Post a Comment