వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్ మోహన్ రెడ్డిపై సిబిఐ కక్షసాధింపు చర్యలను ప్రధాన మంత్రి మన్మోహన సింగ్ దృష్టికి తీసుకువెళ్లినట్లు ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ తెలిపారు. ఈరోజు ఇక్కడ ప్రధానిని కలిసిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. జగన్ కు తగిన భద్రత కల్పించాలని ప్రధానిని కోరినట్లు ఆమె తెలిపారు. సిబిఐ వ్యవహారశైలిపై సుప్రీం కోర్టు జడ్జితో విచారణ జరిపించాలని కోరినట్లు చెప్పారు. జెడి లక్ష్మీనారాయణపై కూడా విచారణ జరిపించమని అడిగినట్లు తెలిపారు. ప్రధాని అన్ని విషయాలు సావధానంగా విన్నారన్నారు. సానుకూల చర్యలు తీసుకుంటామని ప్రధాని హామీ ఇచ్చారని తెలిపారు.
సిబిఐ ఒక్క జగన్ నే ఎందుకు లక్ష్యంగా చేసుకుందని ఆమె ప్రశ్నించారు. ఆ మహానేత వైఎస్ఆర్ కొడుకుగా జగన్ పుట్టడం నేరమా? అని అడిగారు.ఎన్నికల ముందు జగన్ ను అరెస్ట్ చేయడం వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. వైఎస్ కుటుంబం అంటే సిబిఐకి ఎందుకింత కక్ష అన్నారు.
రాష్ట్రపతి ఎన్నికలలో ఎవరికి మద్దతు ఇవ్వాలో ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. ప్రణబ్ ముఖర్జీ, సంగ్మా ఇద్దరూ తమ మద్దతు కోరినట్లు తెలిపారు. పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని విజయమ్మ చెప్పారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment