రాయచూరు(కర్ణాటక): ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ జగన్ మోహన్‌రెడ్డి, కర్ణాటకలో మాజీ మంత్రి గాలి జనార్దన రెడ్డి అరెస్టు వెనుక కేంద్రంలోని కాంగ్రెస్ కుట్ర దాగివుందని రాయచూరు ఎంపీ సన్న పకీరప్ప ఆరోపించారు. బీజేపీ పార్టీకి చెందిన పకీరప్ప, ఇటీవల ఆపార్టీ నుంచి వేరుపడి సొంతకుంపటి పెట్టుకున్న ఎమ్మెల్యే బీ శ్రీరాములుకు మద్దతునిస్తున్న విషయం తెలిసిందే.
బుధవారం ఆయన రాయచూరు కలెక్టరేట్ వద్ద పాత్రికేయులతో మాట్లాడారు. కాంగ్రెస్ చేతిలో సీబీఐ కీలుబొమ్మలా మారిందని విమర్శించారు. ఏపీలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఏకమై జగన్‌ను, కర్ణాటకలో బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్‌లు ఒక్కటై గాలి జనార్దనరెడ్డిని కటకటాల పాలు చేశాయని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

No comments:
Post a Comment