Friday, 6 July 2012
'రాష్ట్రపతి ఎన్నికపై జగన్ దే నిర్ణయం'
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలనేదానిపై పార్టీ అధ్యక్షుడికి బాధ్యత అప్పగిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం ఏకగ్రీవ తీర్మానం చేసింది. పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ ఈ అంశంపై జగన్‌తో మాట్లాడి నిర్ణయం తీసుకోవాలని పార్టీ నాయకులు విజ్ఞప్తి చేశారు. ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి సమావేశ తీర్మానాన్ని ప్రతిపాదించగా సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. జగన్ మోహన్ రెడ్డితో మాట్లాడిన అనంతరం పార్టీ నిర్ణయాన్ని విజయమ్మ ప్రకటిస్తారని మేకపాటి తెలిపారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment