వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభా పక్షం ఉప నాయకులుగా ధర్మాన కృష్ణదాస్ (నరసన్నపేట), మేకతోటి సుచరిత (ప్రత్తిపాడు), భూమా శోభా నాగిరెడ్డి (ఆళ్లగడ్డ) నియమితులయ్యారు. పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఇప్పటికే శాసనసభా పక్షం నాయకురాలిగా ఎన్నికైన విషయం విదితమే. కార్యవర్గాన్ని ఏర్పాటు చేసే అధికారాన్ని విజయమ్మకు కట్టబెడుతూ వైఎస్సార్‌సీఎల్పీ ఇదివరకే తీర్మానం చేసిన నేపథ్యంలో ఆమె శనివారం కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. విప్‌గా బాలినేని శ్రీనివాసరెడ్డి (ఒంగోలు) నియమితులయ్యారు. కార్యదర్శులుగా తెల్లం బాలరాజు (పోలవరం), నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి (కోవూరు), సమన్వయకర్తగా గడికోట శ్రీకాంత్ రెడ్డి (రాయచోటి), కార్యవర్గ సభ్యులుగా గొర్ల బాబూరావు (పాయకరావుపేట), బి.గురునాథరెడ్డి (అనంతపురం), కొరుముట్ల శ్రీనివాసులు (రైల్వే కోడూరు), మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి (ఉదయగిరి) నియమితులయ్యారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment