కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ను అంధాంద్రప్రదేశ్‌గా మారుస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ నేత వాసిరెడ్డి పద్మ విమర్శించారు. విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో ప్రజల నడ్డివిరుస్తోందని ఆమె మండిపడ్డారు. వైఎస్సార్ జయంతి సందర్భంగానైనా ఆయనను గుర్తుచేసుకుని ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోవాలన్నారు. వైఎస్ హయాంలో ఎన్నడూ ఒక్కరూపాయి కూడా ఛార్జీలు పెంచలేదని ఆమె గుర్తు చేశారు.
కిరణ్ సర్కారు తుగ్లక్ కంటే దారుణంగా పాలిస్తోందని దుయ్యబట్టారు. మంత్రులు, ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనకు వెళ్తే మహిళలు తరిమికొడతారని హెచ్చరించారు. వివాదస్పద 26 జీవోలపై రాష్ట్రప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈ జీవోలపై ప్రభుత్వం ఇప్పటికైనా విధానపరమైన నిర్ణయం ప్రకటించాలని వాసిరెడ్డి పద్మ కోరారు.

No comments:
Post a Comment