వై.ఎస్.రాజశేఖరరెడ్డి మరణం వెనుక పెద్ద కుట్ర ఉందని, అది ప్రమాదం కాదనే అనుమానాలు ఇప్పటికీ నెలకొని ఉన్నాయి కనుక సుప్రీంకోర్టు సిటింగ్ జడ్జితో విచారణ జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీజీసీ, సీఈసీ విస్తృత సమావేశం డిమాండ్ చేసింది. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పట్ల సీబీఐ వ్యవహరిస్తున్న తీరును ఖండిస్తూ, వైఎస్ మృతిపై విచారణ కోరుతూ పార్టీ నేతలు బాజిరెడ్డి గోవర్ధన్, భూమన కరుణాకర్‌రెడ్డి తీర్మానాన్ని ప్రతిపాదించారు. హెలికాప్టర్ ప్రమాదవశాత్తు కూలిపోలేదని, దీనివెనుక బడా పారిశ్రామిక వేత్తల హస్తం ఉందనే అనుమానాలను బలపరిచేలా పలు సంఘటనలు చోటుచేసుకున్నా... సరైన విచారణ జరుగలేదని సమావేశంలో అభిప్రాయపడ్డారు. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్‌లో ఉండాల్సిన 30 నిమిషాల నిడివిగల టేప్‌ను మాయం చేసిన వ్యవహారం కూడా బయటకు రావాల్సి ఉంది. ఈ అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యతను విస్మరించిన సీబీఐ దర్యాప్తును సమావేశం తీవ్రంగా ఖండించింది. సుప్రీంకోర్టు సిటింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment