హైదరాబాద్, న్యూస్‌లైన్: ‘‘దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని కాం గ్రెస్ ప్రభుత్వమే పొట్టన పెట్టుకుందని మేమేకాక ప్రజలు కూడా బలంగా విశ్వసిస్తున్నారు. వైఎస్ మరణం తర్వాత చోటు చేసుకుం టున్న పరిణామాలు.. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో వెలుగుచూసిన సీబీఐ జేడీ కాల్ లిస్టు, మా పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిని అరెస్టు చేసిన విధానం అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. వైఎస్ మరణంపై సమగ్ర విచారణ జరిపించాలని జగన్ విమానయాన శాఖ మంత్రి ప్రఫుల్ పటేల్‌కు లేఖ కూడా రాశారు. ఆ విషయాన్ని విజయమ్మ ప్రధాని మన్మో హన్‌సింగ్‌తో ప్రస్తావించారు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు కొల్లి నిర్మలాకుమారి తెలిపారు.
ఢిల్లీలో వైఎస్ విజయమ్మకు లభించిన ఆదరణ చూసి ఓర్వలేక.. ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్, టీడీపీ నేత కోడెల శివప్రసాదరావు అవాకులు చెవాకులు మాట్లాడుతున్నార న్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉప ఎన్నికల్లో లబ్దికోసమే వైఎస్ మరణాన్ని ప్రస్తావించారంటూ కాంగ్రెస్, టీడీపీలు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. వైఎస్ మరణానికి సంబంధించి తమ పార్టీ ప్ల్లీనరీ లోనే తీర్మానం చేసిన విషయాన్ని ఆమె ఈ సందర్భం గా గుర్తుచేశారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా కోట్ల రూపాయలు ఖర్చు చేసి సర్వేలు చేయించుకునే లగడపాటి.. మహానేత మరణం పట్ల దర్యాప్తు ఎందుకు చేయించడం లేదని నిర్మలాకుమారి ప్రశ్నించారు. ‘‘కాంగ్రెస్, టీడీపీల కుమ్మక్కు మరోసారి బట్టబయలైంది. చంద్రబాబు ఆదేశాల మేరకు ఆ పార్టీ నేత కోడెల ప్రెస్‌మీట్‌లో మాట్లాడటం... అదే విషయాన్ని ఢిల్లీలో లగడపాటి చెప్పడం చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. దీన్ని బట్టే వీరిద్దరితో చంద్రబాబే మాట్లాడించారని ప్రతి ఒక్కరికీ అర్థమవుతుంది’’ అని అన్నారు.
No comments:
Post a Comment