ముంబై: ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణంపై దర్యాప్తు జరుపుతున్నమహారాష్ట్ర సీబీఐ జాయింట్ డైరెక్టర్ రిషిరాజ్ ఆకస్మికంగా బదిలీ అయ్యారు. ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణంపై చార్జిషీటు దాఖలైన 24 గంటల్లోనే జేడీ బదిలీ కావడం చర్చనీయాంశమయింది. సీబీఐ బుధవారం దాఖలు చేసిన పదివేల పేజీల చార్జిషీట్ లో మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ సహా 13 మంది పేర్లు ఉన్నాయి. కేరళకు చెందిన రిషిరాజ్ 1985 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన వారు. ఆయన స్థానంలో గుజరాత్ కు చెందిన 1986 ఐపీఎస్ బ్యాచ్ అధికారి కేశవ్ కుమార్ ను నియమించారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment