న్యూఢిల్లీ: సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) అధికారి ప్రదీప్ కుమార్ తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమావేశమయ్యారు. మీడియా ప్రతినిధులతో సీబీఐ జేడీ సంభాషణ, కాల్ లిస్ట్ వ్యవహారాన్ని ఈ సమావేశంలో వైఎస్ఆర్ సీపీ నేతలు సీవీసీకి వివరించారు.
సీబీఐ మాన్యువల్ కు విరుద్ధంగా అధికారులు వ్యవరిస్తున్నారని సీవీసీ దృష్టికి తీసుకువచ్చారు. జగన్ పై కక్షపూరితంగా వ్యవహరిస్తున్న సీబీఐ జేడీపై చర్యలు తీసుకోవాలని సీవీసీని వైఎస్ఆర్ సీపీ నేతలు కోరారు. ఈసమావేశంలో విజయమ్మతో పాటు మేకపాటి రాజమోహన్ రెడ్డి, శోభానాగిరెడ్డి, సుచరితమ్మలతోపాటు పలువురు వైఎస్ఆర్ సీపీ నేతలు పాల్గొన్నారు.

No comments:
Post a Comment