YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Friday, 6 July 2012

జగన్‌ను జైల్లో పెట్టి స్థానిక ఎన్నికలకు కుట్ర

కాంగ్రెస్, టీడీ పీలపై శోభానాగిరెడ్డి మండిపాటు

హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని అక్రమంగా జైల్లో బంధించి స్థానిక ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్, టీడీపీలు కలిసి కుట్ర చేస్తున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ కార్యనిర్వాహక మండలి సభ్యురాలు, ఎమ్మెల్యే భూమా శోభానాగిరెడ్డి ఆరోపించారు. ఏడాదిన్నర కాలంగా స్థానిక ఎన్నికల గురించి ఆలోచించని అధికార పార్టీ.. అకస్మాత్తుగా వాటిని తెరపైకి తేవడంలో ఉన్న ఆంతర్యమేంటని ఆమె ప్రశ్నించారు. జగన్ బయట ఉంటే ఆ ఎన్నికలను కూడా స్వీప్ చేస్తారనే దురుద్దేశంతోనే ఇలా ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు. పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. జగన్‌ను అక్రమంగా నిర్బంధించి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మూడు రోజుల పాటు జిల్లాల పర్యటన చేస్తానని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. దివంగత వైఎస్సార్ ప్రవేశపెట్టిన పథకాల పేరు మార్చడం తప్ప సీఎం కొత్తగా చేస్తున్నదేంలేదన్నారు. వైఎస్ మరణంపై తమకు ఇప్పటికీ అనుమానాలున్నాయని తెలిపారు. వైఎస్ మరణంపై విచారణను ఎలా జరిపించుకోవాలో తమ పార్టీకి అవగాహన ఉందని, దాన్ని తప్పకుండా అమలుచేస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్, టీడీపీ నేతలు చేసే విమర్శలకు విజయమ్మ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. వైఎస్ మరణంపై సమగ్ర దర్యాప్తు చేయించాల్సిన ప్రధాన బాధ్యత అధికారంలో ఉన్న పార్టీకి ఉందన్నారు. అనవసరంగా తమపై బురద చల్లే కంటే ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలని ఆమె డిమాండ్ చేశారు. మూడు నెలల్లో దర్యాప్తు ముగించడం, ప్రమాద స్థలంలో అవయవాలు కూడా సరిగ్గా తీసుకురాకపోవడం దేనికి సంకేతం అని ప్రశ్నించారు.

బొత్స, కొండ్రును బర్తరఫ్ చేయాలి: నల్లా

శ్రీకాకుళం జిల్లా లక్ష్మీపేటలో దళితుల ఊచకోతకు కారకులైన రాష్ట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ, కొండ్రు మురళీమోహన్‌లను వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ ఎస్సీ సెల్ కన్వీనర్ నల్లా సూర్యప్రకాష్‌రావు డిమాండ్ చేశారు. ఐదుగురు హత్యకు గురైన ఈ సంఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత సమగ్ర విచారణ జరిపించాలని శుక్రవారం మీడియా సమావేశంలో కోరారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!