తాజాగా జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఉప ఎన్నికల ఫలితాలపై ఈ నెల 10వ తేదీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండో విడత సమీక్షా సమావేశాలు నిర్వహించనుంది. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో సమీక్ష పూర్తయింది. ఎస్.రఘురామిరెడ్డి, ఎం.వి.కృష్ణారావు, డి.రవీంద్రనాయక్‌తో కూడిన త్రిసభ్య కమిటీ ఆయా నియోజకవర్గాల్లో పార్టీకి వచ్చిన ఓట్లు, శ్రేణుల పనితీరు తదితర అంశాలను సమీక్షిస్తారు.
పదోతేదీ నుంచి ప్రతి రోజు ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు రెండేసి నియోజకవర్గాల చొప్పున ఈ సమీక్షలు జరుగుతాయి. 10న ఒంగోలు, తిరుపతి, 11న నెల్లూరు లోక్‌సభ, ఉదయగిరి, 12న రామచంద్రాపురం, పాయకరావుపేట, 13న పోలవరం, నర్సాపురం, 14న పరకాల, నరసన్నపేట నియోజకవర్గాల సమీక్ష జరుగుతుంది. ఈ సమావేశాలకు పార్టీ తరపున పోటీ చేసి అభ్యర్థులు, జిల్లా కన్వీనర్లు, నియోజకవర్గాల, మండలాల పరిశీలకులు, మండల కన్వీనర్లు హాజరు కావాలని పార్టీ సంస్థాగత వ్యవహారాల రాష్ట్ర కన్వీనర్ పి.ఎన్.వి.ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు.

No comments:
Post a Comment