న్యూఢిల్లీ: రాష్ట్రంలో నెలకొన్న రైతు సమస్యలను పరిష్కరించాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ ను కోరామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ తెలిపారు. పవార్ తో సమావేశమైన తర్వాత జాతీయ మీడియాతో విజయమ్మ మాట్లాడారు. వరికి మద్దతు ధర రాకపోవడంపై పవార్ విస్మయం వ్యక్తం చేశారని.. వెంటనే స్పందించి అధికారులతో మాట్లాడారని విజయమ్మ మీడియా సమావేశంలో వెల్లడించారు. సెంట్రల్ విజిలెన్స్ కమిటి (సీవీసీ) కలిసి సీబీఐ జేడీ కాల్ లిస్ట్ వ్యవహారాన్ని వివరిస్తామని ఆమె అన్నారు.
జగన్ బెయిల్ పిటిషన్ పై విచారణ జరిగిన ప్రతిసారి చార్జిషీట్ దాఖలు చేస్తున్నారని.. సీబీఐ కుట్ర పూరితంగా వ్వవహరిస్తోందని విజయమ్మ ఆరోపించారు. జగన్ ను ఇంకెన్ని రోజులు జైల్లో పెడుతారని మీడియా సమావేశంలో ప్రశ్నించారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలుకావడం లేదడానికి ఉప ఎన్నికల ఫలితాలే నిదర్శనమని ఆమె అన్నారు. ప్రభుత్వాన్ని పడగొట్టాలని వైఎస్ఆర్ సీపీ ఎప్పడూ ప్రయత్నించలేదని విజయమ్మ ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. రాష్ట్ర సమస్యలను ఆలకించిన జాతీయ నేతలందరికి మీడియా సమావేశంలో ధన్యవాదాలు తెలిపారు.

No comments:
Post a Comment