వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో ఈ ఏడాది మార్చి 31న సమర్పించిన మొదటి చార్జిషీట్‌కు అనుబంధంగా మరో చార్జిషీట్ సీబీఐ మంగళవారం కోర్టులో దాఖలు చేసింది. జగతి పబ్లికేషన్స్ సంస్థకు సంబంధించిన వాల్యుయేషన్‌పై ఆ అనుబంధ చార్జిషీట్‌లో ప్రధానంగా ప్రస్తావించింది. జగతి పబ్లికేషన్స్ విలువను జగదీషన్ ఆడిటింగ్ సంస్థ ఎక్కువ చేసి చూపించిందని అందులో పేర్కొన్నారు.
మరోవైపు ఇద్దరు సాక్షులు.. జగతి పబ్లికేషన్స్ డెరైక్టర్ కామర్తి, జగదీషన్ ఆడిటింగ్ సంస్థ ప్రతినిధి ప్రభాకరన్ వాంగ్మూలాలతో కలిసి అనుబంధ చార్జిషీట్‌ను కోర్టుకు సమర్పించింది. వాల్యుయేషన్ పెంచాలని విజయసాయిరెడ్డి తనపై ఒత్తిడి తెచ్చారని జగదీషన్ కంపెనీకి చెందిన ప్రతినిధి ప్రభాకరన్ వాంగ్మూలం ఇచ్చినట్లు సీబీఐ అనుబంధ చార్జిషీట్‌లో పేర్కొంది.
జగతి పబ్లికేషన్ వాల్యుయేషన్‌తో తనకు సంబంధం లేదని, సాయిరెడ్డి, జగన్‌లకే కంపెనీ వ్యవహారాలన్నీ తెలుసని, తాను ఉద్యోగిని మాత్రమేనని జగతి పబ్లికేషన్స్ డెరైక్టర్ హెచ్.సి.కామర్తి వాంగ్మూలం ఇచ్చినట్లు పేర్కొన్నారు. సెజ్‌లలో భూములు కేటాయించేందుకుగాను అధికారులపై జగన్ ఒత్తిడి తెచ్చారంటూ ఆయనపై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 9ని చార్జిషీట్‌లో చేరుస్తున్నట్లు పేర్కొన్నారు. అనుబంధ చార్జిషీట్‌ను కోర్టు ఇంకా విచారణకు స్వీకరించలేదు.

No comments:
Post a Comment