జగతి, జనని, ఇందిరా టెలివిజన్స్‌కు హైకోర్టు ఊరట
50% బ్యాంకు గ్యారంటీ... రూ.5 కోట్ల స్థిరాస్తి పూచీ
స్తంభనకు ముందు ఇచ్చిన ఎఫ్‌ఎల్‌సీలకు ఓకే
హైదరాబాద్, న్యూస్‌లైన్: జగతి పబ్లికేషన్స్, జనని ఇన్‌ఫ్రా, ఇందిరా టెలివిజన్స్ సంస్థల బ్యాంకు ఖాతాల స్తంభనను తొలగించడానికి సంబంధించి గతంలో ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు శుక్రవారం కొంత సడలించింది. ఖాతాల్లో ఉన్న సొమ్ము వినియోగానికి సంబంధించి ఉత్తర్వుల్ని కొంత సడలించాలని అభ్యర్థిస్తూ జగతి సంస్థలు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన అనంతరం కోర్టు ఈ సడలింపునిచ్చింది. ఖాతాల్ని స్తంభింపజేయటానికన్నా ముందు విదేశీ కంపెనీలకు ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ జారీ చేసిన లెటర్ ఆఫ్ క్రెడిట్‌లను (ఎఫ్‌ఎల్‌సీ) యథాతథంగా అమలు చేయొచ్చు. అలాగే ఈ 3 సంస్థలకు కరెంట్ ఖాతాల్లో ఉన్న నగదును వినియోగించుకోవటానికి వీలుగా... దాన్లో 50 శాతం విలువైన మొత్తానికి బ్యాంకు గ్యారంటీని, రూ.5 కోట్ల విలువైన స్థిరాస్తుల టైటిల్ డీడ్స్‌ను సమర్పించాల్సి ఉంటుంది. ఈ షరతులను నెరవేర్చాకే కరెంట్ ఖాతాల్లో లావాదేవీల్ని అనుమతిస్తారు. శుక్రవారం వెలువరించిన తీర్పులో జస్టిస్ బి.చంద్రకుమార్ ఈ మేరకు స్పష్టంచేశారు.

No comments:
Post a Comment