న్యూఢిల్లీ : రైతుల సమస్యలపై ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ సానుకూలంగా స్పందించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ చెప్పారు. ప్రధానిని కలిసిన అనంతరం ఆమె మాట్లాడుతూ రైతుల సమస్యలు చర్చించడానికే ఢిల్లీ వచ్చినట్లు తెలిపారు. రాష్ట్రంలో రైతాంగ సమస్యలను ప్రధానికి వివరించినట్లు చెప్పారు. రైతులకు విత్తనాలు, ఎరువులు సరిగా అందడంలేదన్నారు. మరోవైపు విద్యుత్ సరఫరా సరిగాలేక రైతన్న విలవిలలాడిపోతున్నారన్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించక నష్టపోతున్నారు. పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వడంలేదని తెలిపారు.
విజయమ్మ వెంట ఎంపీలు సబ్బం హరి, మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఎమ్మెల్యేలు శోభా నాగిరెడ్డి, సుచరిత, మాజీ ఎమ్మెల్యే పిల్లి సుభాష్ చంద్రబోస్ ఉన్నారు
విజయమ్మ వెంట ఎంపీలు సబ్బం హరి, మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఎమ్మెల్యేలు శోభా నాగిరెడ్డి, సుచరిత, మాజీ ఎమ్మెల్యే పిల్లి సుభాష్ చంద్రబోస్ ఉన్నారు
No comments:
Post a Comment