రైతుల సమస్యలు పరిష్కరించటంలో సర్కారు ఘోర వైఫల్యం
8న వైఎస్ జన్మదినం సందర్భంగా ప్రభుత్వంపై నిరసనలు
రైతు సమస్యలపై వైఎస్ విగ్రహానికి వినతిపత్రాల సమర్పణ
లక్ష్మీపేట దళితులను హత్యచేసిన దోషులను కఠినంగా శిక్షించాలి
రాష్ట్రపతి ఎన్నికపై పార్టీ వైఖరి నిర్ణయాధికారం జగన్‌కే
పార్టీపై విశ్వాసం ఉంచినందుకు ప్రజలకు కృతజ్ఞతలు
హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్రంలో రైతుల కష్టాలను తీర్చటంలో ఘోరంగా విఫలమైన ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరచి వారిని ఆదుకోవాలని వైఎస్సార్ కాం గ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. రైతులు, రైతు కూలీలు, చేనేత కార్మికులు, మత్స్యకారులు, గిరిజనులు, దళి తులు.. అన్ని వర్గాల ప్రజలనూ సర్కారు విస్మరించిందని, వారి సంక్షేమాన్ని ఏ మాత్రం పట్టించుకోవటం లేదని ధ్వజమెత్తింది. శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ అధ్యక్షతన జరిగిన కేంద్ర పాలకమండలి, కార్య నిర్వాహక మండలి, ప్రజాప్రతినిధుల, అనుబంధ సంఘాల విస్తృత సమావేశంలో 11 తీర్మానాలను ఆమోదించారు. సమావేశం వివరాలను పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కోఆర్డినేటర్ కొణతాల రామకృష్ణ, కమిటీ సభ్యులు డి.ఎ.సోమయాజులు మీడియాకు వెల్లడించారు. తీర్మానాల్లోని ముఖ్యాంశాలివీ...
విత్తనాలు, ఎరువుల ధరలు పెరిగి పోతున్నాయి కానీ ధాన్యానికి కనీస మద్దతు ధర మాత్రం పెరగటం లేదని సమావేశం అభిప్రాయపడింది. గత ఏడాది మాదిరిగానే రైతులు క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితులు నెలకొనకుండా తక్షణం ప్రభుత్వం జోక్యం చేసుకుని నివారించాలని డిమాండ్ చేసింది.
రైతుల కష్టాలను శాశ్వతంగా తీర్చే ప్రాణహిత-చేవెళ్ల, పోల వరం ప్రాజెక్టుల నిర్మాణాన్ని తక్ష ణం చేపట్టాలని విజ్ఞప్తి చేసింది.
వైఎస్ 63వ జయంతి అయిన ఈ నెల 8న రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు నివాళులర్పిం చి.. రైతులు, రైతు కూలీల సమస్యల పట్ల రాష్ట్ర ప్రభు త్వ వైఖరిని నిరసిస్తూ వైఎస్ విగ్రహాలకు వినతి పత్రా లు సమర్పించాలని సమావేశంలో నిర్ణయించారు. వైఎస్ విగ్రహాలకు సమర్పించే వినతి పత్రంలో రైతు సమస్యలు పరిష్కరించేలా ప్రభుత్వానికి జ్ఞానోదయా న్ని కలిగించాల్సిందిగా ప్రార్థించాలని నిర్ణయించారు.
వైఎస్ ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, ఆరోగ్యశ్రీ, పావలా వడ్డీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, 108, 104 సర్వీసులకు ప్రభుత్వం తిలోదకాలు ఇవ్వటంపై తీర్మానంలో ఆగ్రహం వ్యక్తం చేసింది. వీటన్నింటినీ పూర్తి స్థాయిలో అమలు చేయాలని కోరారు.
శ్రీకాకుళం జిల్లా లక్ష్మీపేట దళితులను హత్య చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని తీర్మానం చేశారు. హైకోర్టు సిటింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
విశాఖపట్నం సమీపంలో ఎన్‌టీపీసీ కాలుష్యం వల్ల మత్స్యకారుల ప్రశాంత జీవితానికి భంగం వాటిల్లకుండా పూర్తి భరోసా ఇవ్వాలని కోరుతూ తీర్మానం చేశారు. అక్కడ ఆందోళన చేస్తున్న వారిపై పోలీసులు లాఠీచార్జి చేయటాన్ని సమావేశం ఖండించింది.
చేనేత కార్మికులకు ఇవ్వాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలనీ వారి ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లు కల్పించాలనీ తీర్మానం చేశారు. గిరిజనుల సర్వతోముఖాభివృద్ధికి వైఎస్ తీసుకున్న చర్యలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. మైనారిటీలకు 4% రిజ ర్వేషన్లు పటిష్టంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభాన్ని అధిగమించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన విధానాన్ని నిర్ణయించే అధికారాన్ని అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి అప్పగిస్తూ తీర్మానం చేశారు.
ప్రచార బాధ్యతలు చేపట్టి ఉప ఎన్నికల్లో ఒంటి చేత్తో పార్టీ అభ్యర్థులను గెలపించినందుకు సమావేశం విజయమ్మను అభినందించింది. వైఎస్సార్ కాంగ్రెస్‌పై అచంచల విశ్వాసంతో ఓట్లేసి జాతీయ స్థాయిలో ఒక శక్తిగా ఎదిగేం దుకు దోహదం చేసిన రాష్ట్ర ప్రజలకు ఒక తీర్మానంలో హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
జగన్ కేసుల విషయంలో సీబీఐ కక్ష సాధింపుతో వ్యవహరిస్తోందనీ, ఎలాంటి నేర నిర్ధారణ కాక పోయి నా అక్రమంగా అరెస్టు చేశారనీ సమావేశం ఒక తీర్మానంలో ఖండించింది. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన సీబీఐ కొన్ని పత్రికలకు ముందుగానే తప్పుడు సమాచారం చేరవేస్తోందని మండిపడింది. సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ తన విధులను పక్షపాతం తో నిర్వహిస్తున్నారని కాంగ్రెస్, టీడీపీలకు లబ్ధి చేకూర్చే విధంగా విచారణ చేస్తున్నారనే విషయం వెల్లడైందని దీనిని సమావేశం ఖండిస్తోందని తీర్మానం చేశారు.
No comments:
Post a Comment