న్యూఢిల్లీ: సిబిఐ జెడి లక్ష్మీనారాయణ వ్యవహార శైలి పూర్తిగా అభ్యంతరకరం అని సిపిఐ అగ్రనేత బర్ధన్ అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఈరోజు బర్దన్ ని కలిసి సిబిఐ వేధింపులు, అక్రమ కేసులు, జెడి లక్ష్మీనారాయణ తీరుని వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రాజకీయ అవసరాల కోసం సిబిఐని ఉపయోగిస్తోందన్నారు. దర్యాప్తు వివరాలను జెడి లక్ష్మీనారాయణ మీడియాకు లీక్ చేయడం కాదని, కోర్టుకు సమర్పించాలని ఆయన అన్నారు. ఈ విషయంలో ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ జోక్యం చేసుకొని చర్యలు తీసుకోవాలన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment